మహేష్ బాబు - కొరటాల సినిమా మొదలైపోయింది. ఈ నెల 9 న అధికారికంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందని చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులని కొరటాల అప్పుడే మొదలెట్టేశాడని సమాచారం. అన్ని పనులను చాలా వేగం గా కానిచ్చేసే కొరటాల ఇప్పుడు మహేష్ చిత్రం కోసం హీరోయిన్స్ ని వెతికే పనిలో పడ్డాడట. ఇప్పటిదాకా తన సినిమాల్లో తీసుకున్న హీరోయిన్స్ ని కాకుండా వేరే హీరోయిన్ ని మహేష్ కి జోడిగా పెట్టాలని భావిస్తున్నాడట.
తాను తీసిన మూడు సినిమాల్లో హీరోలకు స్టార్ హీరోయిన్స్ నే తీసుకున్నాడు కొరటాల. మొదటి సినిమా మిర్చి లో అనుష్కని, రిచా గంగోపాధ్యాయని తీసుకున్న కోరటాల తన రెండో సినిమాలో మహేష్ కోసం శృతిని పట్టుకొచ్చాడు. ఇక మూడో సినిమా ఎన్టీఆర్ కోసం సమంతని, నిత్యని తీసుకున్నాడు. ఇక మళ్ళీ మహేష్ చిత్రం కోసం ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నాడట. అంటే ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లేరనా కొరటాల ఉద్దేశ్యం. ఏమో కొరటాల ఏం అనుకుంటున్నాడో గాని మహేష్ చిత్రం కోసం ఈసారి ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. అంటే బాలీవుడ్ రేంజ్ హీరోయిన్ ని తీసుకోడట గాని...... కొత్త అమ్మాయి అంటే తెలుగమ్మాయిని తీసుకుంటాడని కొరటాల సన్నిహితులు చెబుతున్నారు.
ఇక ఇప్పటికే ఇద్దరి హీరోయిన్స్ పేర్లను మహేష్ కి చెప్పాడని..... ఇంక మహేష్ ఆలోచనే ఫైనల్ అని అంటున్నారు. అయితే మహేష్ మాత్రం లేట్ అయినా పర్లేదు మంచి హీరోయిన్ దొరికే వరకు ఆగమని కొరటాలకు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.