Advertisementt

బుద్దొచ్చింది ఇక వెళ్ళను..!!

Thu 10th Nov 2016 07:49 PM
kajal agarwal,bollywood,kajal agarwal not going to bollywood  బుద్దొచ్చింది ఇక వెళ్ళను..!!
బుద్దొచ్చింది ఇక వెళ్ళను..!!
Advertisement
Ads by CJ

ఈ మాటన్నది ఎవరో కాదు ఖైదీ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకు బాలీవుడ్ లోకెళ్ళాక బాగా బుద్దొచ్చిందట. అందుకే ఈసారి అవకాశం వచ్చినా బాలీవుడ్లోకి కాలుపెట్టేది లేదని ఖచ్చితంగా చెబుతుంది. అసలు మొదట్లో 'సింగం' సినిమాతో బాలీవుడ్ లో కాజల్ కి ఆఫర్ వచ్చినప్పుడు ఇక అక్కడే సెటిల్ అవుదామని అనుకుంది ఈ అమ్మడు. కానీ సరైన అవకాశాలు రాక మళ్ళీ సౌత్ కొచ్చిపడింది. మళ్ళీ సౌత్ సినిమాల్లో బిజిగా ఉంటూనే ఒక రాయి బాలీవుడ్ లో వేసింది.స్పెషల్‌ 26 ,'దో లఫ్జోంకా కహానీ' వంటి చిత్రాల్లో అవకాశాలొచ్చినా అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఎలాగైనా బాలీవుడ్లో నిలదొక్కుకోవాలని చూసింది కానీ పరిస్థితితులు అనుకూలించక మళ్ళీ తిరిగి సౌత్ కి మూటా ముల్లె సర్దుకుంది. 

అయినా కాజల్ కి బాలీవుడ్ మీద వ్యామోహం పోలేదు. అప్పుడప్పుడు బాలీవుడ్ ఫ్యాషన్ తరహాలో డ్రెస్ లు వేసుకుని అక్కడ జరిగే అవార్డ్స్ ఫంక్షన్స్ కి పార్టీలకి హాజరవుతూ..... బాలీవుడ్ వాళ్ళు ఏమైనా అవకాశాలిస్తారేమో అని ఎదురు చూసింది. కానీ ఆమెకు అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడు కొన్నాళ్ళు ఖాళీగా వున్న కాజల్ మళ్ళీ కాస్త తెలుగు, తమిళం లో బిజీ తారగా మారింది. ఇలా ఇక్కడ బిజీ గా వున్న టైమ్ లో బాలీవుడ్ గురించి ఆలోచిస్తే ఇక్కడ వచ్చే కొద్దో గొప్పో అవకాశాలు కూడా పోతాయేమో అని భయపడి ఇక బాలీవుడ్ ఊసెత్తనని చెబుతుంది. అంతలా ఆమెని  బాలీవుడ్ భయపెట్టిందన్నమాట.

అంతేగా మరి బాలీవుడ్ కోసం చాలామంది హీరోయిన్స్ ఇక్కడ  సౌత్ ని చిన్న చూపు చూడడం ....అక్కడ బాలీవుడ్ లో అవకాశాలు రాక ఉసూరుమంటూ మళ్ళీ సౌత్ కి రావడం మాములేగా. ఇక కాజల్ కూడా అందరి హీరోయిన్స్ మాదిరిగానే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ చెల్లుబాటుకాక ఇక్కడ సౌత్ కే పరిమితమవ్వాలనుకుంటుంది. ఇప్పటికి కాజల్ ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే  కనబడుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ