సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు బుధవారం శ్రీకారం చుట్టారు. శ్రీమంతుడు కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అంటే అంచనాలు భారీగా ఉన్న సినిమా అన్నమాట. ఈ క్రెడిట్ డివివి.దానయ్య కొట్టేశాడు. మహేష్ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. కొత్త సంవత్సరంలో దసరా సెప్టెంబర్ 30వ తేదిన వస్తుంది. ఆరోజు శనివారం కాబట్టి సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తారని అనుకోవచ్చు. అంటే ఇంకా పదినెలలు ఉంది. పెద్ద సినిమా మేకింగ్ కు సమయం చాలా పడుతుందనేది వాస్తవం. కానీ రిలీజ్ డేట్ కమిట్ అవడం వల్ల షూటింగ్ వేగంగా జరిగే అవకాశాలున్నాయి. దసరాకి మహేష్ బాబు కర్ఛీఫ్ వేసేశాడు కాబట్టి రిజర్వ్ అయిపోయినట్టే.
అయితే దసరాకి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవడం ఎప్పుడూ ఉండేదే. మరి మహేష్ తో పోటీగా వచ్చే సినిమాలు ఏవనే దానిపై స్పష్టత లేనప్పటికీ, బరిలో మహేష్ సినిమాకు పోటీగా త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ సినిమా వచ్చే అవకాశాలున్నాయని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుంది.