పెద్ద నోట్ల రద్దు దేశం మొత్తం కుదిపేస్తోంది. ఇక ముఖ్యంగా సినీపరిశ్రమ పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో అతలాకులతలం అయిపొయింది. అసలు సినిమా పరిశ్రమ తేరుకోవడానికి చాలా టైం పట్టేలా వుంది. ఈ పెద్ద నోట్ల రద్దు దెబ్బ సినిమా పరిశ్రమపై పడడం స్పష్టంగా... సినిమాల విడుదలపై ఈ ప్రభావం పడడం కనబడుతుంది. రేపు సినిమాల విడుదల అయోమయంలో పడ్డాయి. ప్రముఖంగా రేపు నాగ చైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా, అల్లరి నరేష్ నటించిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక నాగ చైతన్య 'ప్రేమమ్' సినిమా హిట్ తో యమా ఖుషీగా ఉన్నాడు. ఇక చాలా రోజులనుండి విడుదలకు నోచుకోని తన 'సాహసం...' సినిమాని రేపే విడుదల చెయ్యాలని గట్టి నిర్ణయంతో కనబడుతున్నాడు.
ఇక ఈ మధ్యన అసలు హిట్ లేకుండా వరుస సినిమాల ప్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేష్ మాత్రం తన 'దెయ్యం...'సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తన సినిమా ఈసారి కంపల్సరీ హిట్ అయ్యేలా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు అల్లరి. పాపం సమయం చూసుకుని విడుదల తేదీ ప్రకటించాడు. కానీ ఇప్పుడు మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో హిట్ కోసం అల్లాడుతున్న అల్లరి మాత్రం కొంచెం వెనక్కి తగ్గినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా వాయిదా పడిందని అనుకుంటున్నారు. అయితే మరి ఎక్కువ పోస్ట్ పోన్ చెయ్యకుండా శుక్రవారం బదులు శనివారం విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.
ఇక ఇప్పటికే పెద్ద నోట్ల స్థానంలోకి కొత్త నోట్లు అందుబాటులోకి రావడం మొదలయ్యాయి. అయినా ఎందుకులే రిస్క్ చెయ్యడమని అల్లరి తన సినిమాని ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నాడు. ఇక శుక్రవారం మాత్రం నాగ చైతన్య తన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో సోలోగో వస్తున్నదన్నమాట.