Advertisementt

సినీ ప్రముఖుల ట్వీట్లకు మోడీ ఖుషీ ఖుషీ..!

Thu 10th Nov 2016 04:08 PM
nagarjuna,narendra modhi,kamal hasaan,rajinikanth,pm narendra modi thanks rajinikanth,karan johar  సినీ ప్రముఖుల ట్వీట్లకు మోడీ ఖుషీ ఖుషీ..!
సినీ ప్రముఖుల ట్వీట్లకు మోడీ ఖుషీ ఖుషీ..!
Advertisement
Ads by CJ

భారతదేశంలో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా స్వచ్ఛ భారత్ సంకల్పంతో మోడి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అన్ని రంగాలలోనూ నీతిమంతులుగా

ముందుకు వెళ్తే భారత్ అద్భుత ఫలితాలను సాధిస్తుందన్నది మోడి ఆశయం. అందులో భాగంగానే రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ల ద్వారా తెలిపాడు. కాగా మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రముఖులకు ఇచ్చిన సమాధానంలో మోడి ఈ విధంగా స్పందించాడు. సినీ రంగానికి చెందిన కరణ్ జోహార్, రజనీకాంత్, అజయ్ దేవగన్, కమలహాసన్, అక్కినేని నాగార్జున, రితేశ్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా, క్రికెటర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, కైలాష్ సత్యార్థి వంటి వారు మోడీ  తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా సమాధానాలను వెల్లడించాడు.                                                                                                                                                                            

కమల్ హాసన్ స్పందిస్తూ.. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా అంతా పండగ చేసుకోదగిన నిర్ణయం మోడి తీసుకున్నారు అందులో ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు అన్నాడు.  అందుకు మోడీ స్పందిస్తూ.. మెరుగైన భారత దేశం కావాలని కోరుకుంటున్న నిజాయితీపరులైన భారతీయుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇంకా రజనీ కాంత్ మోడి నిర్ణయాన్ని స్వాగతిస్తూ... ‘హ్యాట్సాఫ్ నరేంద్ర మోడీజీ, నూతన భారత్ ఆవిర్భవించింది. జైహింద్’ అంటూ ట్వీట్ లో  పేర్కొన్నాడు. అందుకు మోడీ.. ‘కృతజ్ఞతలు, మనమంతా కలిసి సుసంపన్నమైన, అవినీతి రహిత భారత దేశాన్ని నిర్మిద్దాం’ అని ప్రధాని వివరించాడు. ఇంకా కరణ్ జోహార్ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్. నరేంద్ర మోడిజీ బంతిని స్టేడియం వెలుపలికి కొట్టారు’ అనడంతో...దీనికి ప్రధాని స్పందిస్తూ... చాలా కృతజ్ఞతలు, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం అవినీతిరహిత భారత దేశాన్ని మనం సృష్టించాలని అన్నాడు. అయితే మన హీరో నాగార్జున మాత్రం వెరైటీగా స్పందించాడు.. ఏంటంటే ‘పన్ను చెల్లించే మాలాంటి వారినందరినీ సత్కరించినందుకు ధన్యావాదాలు. ఆర్థికంగా బలపడే దిశగా భారత దేశం అడుగులేస్తోంది’ అంటూ నాగార్జున తన ట్వీట్స్ ద్వారా ప్రధానిని అభినందించాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ