భారత దేశంలో ప్రధానంగా కులాన్ని ఆశ్రయించి రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దేశమంతా కూడా ఒక రకంగా కుల రాజకీయాల కుంపటిగా తయారైంది. ఏ కులం వాళ్ళు ఆ కులం తరఫున ప్రతినిధి ఉండాలంటూ వారి వారి నాయకులను ఎన్నకోవడం జరుగుతున్నతీరును చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్ర కూడా కుల రాజకీయాల కుంపటిగా మారుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహించాడు. తాజాగా రాజ్ ఠాక్రే మాట్లాడుతూ..ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే స్వచ్ఛమైన ఇద్దరు మిత్రులు కలిసి భోజనం చేసినా వారి మధ్య కులాన్ని అంటగట్టే పరిస్థితికి మన రాజకీయాలు దిగజారాయని ఆయన అన్నాడు. కాగా పుణేలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
రాజకీయ నాయకులు కావాలనే వారి స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి కులంచిచ్చు పెడుతున్నారని రాజఠాక్రే మండిపడ్డాడు. వారు మహారాష్ట్రను ఉత్తర ప్రదేశ్, బీహార్‌గా మార్చాలని చూస్తున్నారని ఆయన చెలరేగి పోయాడు. ఇలా ఏ రాజకీయ నాయకుడైతే వ్యవహరిస్తారో వారి ఆటలు ఎల్లకాలం సాగవని ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మొత్తానికి రాజ్ ఠాక్రే మహారాష్ట్రలో జరిగే ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ రాష్ట్రాన్ని చక్కదిద్దే పనిలో ఉన్నాడన్న మాట. ఈ మధ్య భారత్-పాక్ సర్జికల్ దాడుల విషయంలో కూడా పాక్ కళాకారులను పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్న విషయంలో కఠినంగా వ్యవహరించి అందరికీ కేంద్రంగా మారిన విషయం తెలిసిందే.