Advertisementt

బాలయ్య.. దాద్దామంటే దాగడంలేదట..!!

Thu 10th Nov 2016 11:10 AM
gpsk,balakrishna,director krrish,gpsk movie  బాలయ్య.. దాద్దామంటే దాగడంలేదట..!!
బాలయ్య.. దాద్దామంటే దాగడంలేదట..!!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక నందమూరి ఫాన్స్ అయితే తమ హీరో బాలకృష్ణ ఖచ్చితం గా సంక్రాంతి హీరో అనిపించుకుంటాడని డంకా భజాయించి చెబుతున్నారు. ఇక బాలకృష్ణ కి సంబందించి వెరైటీ వెరైటీ గెటప్స్ తో వున్న ఫొటోస్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఆ గెటప్స్ లో బాలకృష్ణ ని చూస్తుంటే  నందమూరి ఫాన్స్ పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. 

ఇంతలా గౌతమీ..... మీద రోజు రోజుకి అంచనాలు పెంచేలా బాలకృష్ణ రాజసం ఉట్టిపడుతుంది. ఇక ఇప్పుడు బాలకృష్ణని ఒక సమస్య వెంటాడుతోందని అంటున్నారు. అదేమిటంటే అసలు బాలకృష్ణ ప్రమేయం లేకుండానే ఆ ఫొటోస్ నెట్ లో లీకయ్యాయని అంటున్నారు. బాలకృష్ణ కే కాదు అసలు డైరెక్టర్ క్రిష్ కి కూడా ఆ పిక్స్ నెట్ లో ఎలా లీక్ అయ్యాయో తెలియదట. ఎంతో జాగ్రత్తగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి సంబంధించి అన్నివిషయాలు దాస్తున్నారట. కానీ వారి ప్రమేయం లేకుండానే ఇలా గౌతమి పిక్స్ లీక్ అవుతుంటే డైరెక్టర్ క్రిష్, బాలయ్య ఇద్దరూ తలలు పట్టుకుంటున్నారట. 

ఇక ఫొటోస్ లీక్ అయ్యాక ఏం చేస్తారు అవే ఫొటోస్ ని మళ్ళీ ఆఫీసియల్ గా ప్రెస్ కి పంపుకున్నారట. ఎంతో గుట్టుగా గౌతమిని దాచి అందరిలో క్యూరియాసిటీ పెంచుదామంటే ఇలా జరుగుతుందని డైరెక్టర్ క్రిష్ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ