సంచలనాత్మక దర్శకుడు వర్మ లెక్క కరెక్టయింది. అమెరికాలో జరిగిన హోరాహోరి ఎన్నికల్లో తాను గెలవాలని భావించిన వ్యక్తే గెలిచినందుకు వర్మ తెగ సంబరపడిపోతున్నాడు. అందుకోసం తన్ను తాను మెచ్చుకుంటూ భుజాలు చరుచుకుంటూ తెగ ఆనందపడిపోతున్నాడు. కాగా అమెరికాలోని అధ్యక్ష ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంగా ట్రంప్ కంపు అంటూ ఆయన మాటలను మీడియా అంతా బూతద్దంలో పెట్టి మరీ రిపీట్ రిపీట్ గా వేస్తూ సంచనలం రేపిన విషయం కూడా విదితమే. ట్రంప్ ఎన్నికల ప్రచారం చాలా సంచలనాలకు దారితీసిది. అందులో ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే ముస్లింలను దేశంలోకే రానివ్వనని ప్రకటించడం, మెక్సిన్ బోర్డర్ లో గోడ కట్టిస్తానని తెల్పడం, అదీ మెక్సికో డబ్బులతోనే కట్టిస్తానని వెల్లడించడం, ఇంకా తన ప్రణాళికతో బిజినెస్ ఈక్వేషన్లే మార్చేస్తానని తెల్పడం వంటి వాటిని మీడియా అతిగా చేసి చూపించి ట్రంప్ ను ఓ బపూన్ గా చిత్రించింది. అలాంటి సందర్భంలో మన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ట్రంప్ ను తెగ మెచ్చుకున్నాడు. ఈయనే అమెరికా అధ్యక్షుడు కావాలని కోరుకున్నాడు.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ భావించినట్లుగానే ట్రంప్ విజయదుందిబిని మోగించడంతో వర్మ ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. అంతేకాకుండా తాను చెప్పినట్లుగానే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని, అందుకు తనకు చాలా ఆనందంగా కూడా ఉందని, ఈ రోజు రాత్రికి తాను అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు వర్మ. అంతేకాకుండా అప్పట్లో అంతా ట్రంప్ ను నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అన్నారు, అలా అన్నవారంతా ఇప్పుడు నాన్ సెన్స్ గా మాట్లాడామని అనుకుంటున్నారని వివరించాడు వర్మ. ఇంకా వర్మ మాట్లాడుతూ.. ఇప్పుడు ట్రంప్ గెలిచిన స్థానాలన్నీ అప్పట్లో ఒబామా గెలిచిన స్థానాలే. అందుకనే ఇప్పుడు ఏకంగా ట్రంప్ ఒబామానే ఓడించినట్లయిందని వర్మ వివరించాడు.