Advertisementt

బన్నీ ఏమైనా.. పవన్ అనుకుంటున్నారా..!

Wed 09th Nov 2016 02:35 PM
pawan kalyan,allu arjun,saptagiri express audio releasing function,nikhil,comedian srinivas reddy  బన్నీ ఏమైనా.. పవన్ అనుకుంటున్నారా..!
బన్నీ ఏమైనా.. పవన్ అనుకుంటున్నారా..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య చిన్న సినిమా, అందులోనూ కమిడియన్ హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్ళి అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే ఆ బాటలో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా నడవబోతున్నాడు. తాజాగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లు జరుపుకోబోతున్న ఓ రెండు సినిమాలకు ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. కాగా వాటిలో నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒకటి కాగా, కమిడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం మరొకటి. కాగా ఈ రెండు సినిమాలకు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా పోయి ఆ యా సినిమాల రేంజ్ ని మరింత హైప్ తీసుకురావాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో ఫంక్షన్ కు పవన్ రావటం మూలంగానే ఈ సినిమాకు బాగా హైప్ క్రియేట్ అయింది. అంతవరకు ఓకే. కానీ ఈ  రెండు సినిమాలకు అల్లు అర్జున్ ఆడియోకి వెళ్లడం కారణంగా నిజంగా అంత హైప్ వస్తుందంటారా. అల్లు అర్జున్ పవన్ కు మేనల్లుడు అయినంత మాత్రాన పవన్ ఇమేజ్ అల్లు అర్జున్ కు రానుందా. అంతటి ధీమా బన్నీలో ఉందా. చూద్దాం ఏం జరుగుతుందో. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ