Advertisementt

'ధృవ' మాట తప్పడం లేదు..!

Wed 09th Nov 2016 01:59 PM
ramcharan,dhruva,chiranjeevi,dhruva movie,dhruva movie release same date  'ధృవ' మాట తప్పడం లేదు..!
'ధృవ' మాట తప్పడం లేదు..!
Advertisement
Ads by CJ

గత రెండు మూడు రోజులుగా ధృవ సినిమా డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 9 కి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అసలు ముందు ధృవ సినిమాని డిసెంబర్ 2 న విడుదల చేస్తామని రామ్ చరణ్ సినిమా మొదలైనప్పుడే చెప్పాడు. ఏమైందో ఏమో రెండు రోజుల నుండి ధృవ సినిమా రిలీజ్ డేట్ కి రాకుండా ఒక వారం వెనక్కి వెళ్ళిందని తెగ ఊదరగొడుతున్నారు. అదంతా వట్టి రూమరేనట.  ధృవ సినిమా అనుకున్న డేట్ కి  అనుకున్న టైమ్ కే విడుదలవుతుందట. 

చరణ్ తన తండ్రి చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెంబర్ 150 కి తన ధృవ చిత్రానికి ఒక నెల గ్యాప్ ఉండాలని భావించి ధ్రువ చిత్రాన్ని డిసెంబర్ రెండున రిలీజ్ డేట్ ప్రకటించాడు. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 9 కి గనక ధృవ ని పోస్ట్ ఫోన్ చేస్తే గనక తన తండ్రి 150 వ చిత్రానికి తన ధృవ చిత్రానికి గ్యాప్ తగ్గుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 2 న రావడానికే చరణ్ చూస్తున్నాడట. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాల్లోకి దిగిన ధృవ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసిందని సమాచారం. ఇక పాటలు కూడా ఈ రోజు రాత్రి 12.30 నిమిషాలకు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

ఇక ధృవ ఏ హంగామా లేకుండా థియేటర్లోకి రావడం లేదు. ఒక మంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో అభిమానులను ఉత్సాహపరిచి మరీ డిసెంబర్ 2 న ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరంగల్ వేదికగా ఈ నెల 20న జరగనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ