సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని మొదట చూడాలన్న కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఆడియో ఫంక్షన్ కు రావడం మూలంగా నిజంగానే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాకి ఊహించనంత హైప్ క్రియేట్ అయింది. అసలు ఈ సినిమా ట్రైలర్‌ని ఇంతవరకు అన్ని లింకుల్లో కలిపి 25 లక్షలమంది వీక్షించారంటే మామూలు విషయం కాదు. ఇంత స్థాయిలో హైప్ క్రియేట్ కావడానికి పవన్ రాక వల్లనే అంటూ సంబరపడిపోతుంది చిత్రబృందం.
అంతేకాకుండా..ఈ చిత్రానికి ట్రైలర్ విడుదల కాగానే పంపిణీదారులు ఎంక్వైరీలు కూడా మొదలు పెట్టారు. ఇంకా.. ఈ సినిమాని అవుట్ రేట్‌కి కొనడానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్టు కూడా టాక్ నడుస్తుంది.
కాగా ఈ ఆనందంతో సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రబృందం పవన్ కళ్యాణ్ ను మరోసారి కలిసింది. ఈ సందర్భంగా సినిమా బిజినెస్ గురించిన సమాచారాన్ని ఆనందంతో పవన్ కళ్యాణ్ తో పంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రబృందం పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్న సందర్భంగా ఈ విషయాల గురించిన ప్రస్తావన జరిగింది. ఈ సందర్బంగా పవన్ కూడా ప్రత్యేకంగా సప్తగిరిని ఈ సినిమా ఎప్పుడు చూపిస్తున్నావ్ అని కూడా అడిగినట్లు సమాచారం అందుతుంది. కాగా రెండు రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని, ఆ తర్వాత మొదటి షో మీకే చూపిస్తామని తెలిపినట్లు కూడా వెల్లడౌతుంది. అయితే సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా మొత్తం రూ. 6కోట్ల వరకు చేసిందని, కంటెంట్ తో పాటు క్వాలిటీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా ఓ కమిడియన్ ను హీరోగా పెట్టుకొని ఇంత బడ్జెట్ తో చేసిన ఈ చిత్రానికి పాటలన్నీ ఫారిన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇంకా ట్రైలర్ లో చూపినదాన్ని బట్టి ప్రతి సీను లావిష్ గా తెరకెక్కించినట్లు కూడా అర్థమౌతుంది.ఇక చూద్దాం సప్తగిరి ఎక్స్ ప్రెస్ బిజినెస్ పరంగా ఏ స్థాయిలో పరిగెడుతుందో...?