నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నితిన్ ఎలాగో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఇప్పటివరకు నితిన్ ప్రేమ,పెళ్లి అంటూ ఎప్పుడూ కబుర్లు చెప్పలేదు. అసలు పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక మీడియా వాళ్ళు కూడా నితిన్ పెళ్లి గురించి పెద్దగా చర్చ తీసుకురాలేదు. అయితే ఇప్పుడు తాజాగా నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే నితిన్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నారు. అయితే నితిన్ కి లవ్ ని సెట్ చేసింది మాత్రం నితిన్ ఫ్రెండ్, అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ అని చెబుతున్నారు.
అక్కినేని అఖిల్ కి తన లవర్ శ్రీయ భూపాల్ తో నిశ్చితార్దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖిల్ , శ్రీయ భూపాల్ ద్వారా పరిచయమైన అమ్మాయినే ఇప్పుడు నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడట. శ్రీయ భూపాల్ కి ఫ్రెండ్ అయిన అమ్మాయితో నితిన్ కి పరిచయం ఏర్పడి అది కాస్తా పెళ్ళికి దారితీసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు తనకన్నా చిన్న వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటుంటే నితిన్ మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నితిన్ ఇప్పుడు బ్యాచిలర్ పదవికి శుభం కార్డు వేసేలా అఖిల్ ప్లాన్ చేసాడని అంటున్నారు. ఇక అఖిల్..తనకు కాబోయే భార్య శ్రీయతో కలిసి.. నితిన్ కి పెళ్లి కుదిర్చినట్లు వార్తలొస్తున్నాయి.
అఖిల్ కి నితిన్ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్ కారణంగానే అఖిల్ మొదటి సినిమాని నితిన్ ప్రొడ్యూస్ చేసాడు. దానికి కృతజ్ఞతగా ఇప్పుడు నితిన్ పెళ్లి కుదిర్చి ఋణం తీర్చేసుకుంటున్నాడన్నమాట.