రామ్ గోపాల్ వర్మ కి సినిమాలకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ట్విట్టర్ మీదే ఉంటుంది. ఆయన తీసే సినిమాల కన్నా ఎక్కువ ధ్యాస ట్విట్టర్ మీదే పెడతాడంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ట్వీట్స్ చెయ్యడమెవ్వరికైనా మామూలే. కానీ రామ్ గోపాల్ వర్మకి ఒక సందర్భమంటూ ఏమి ఉండదు. ప్రతి చిన్న విషయాన్నీ ట్వీట్స్ తో పెద్దది చేసి అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పాజిటివ్ ట్వీట్ లతో, కొన్నిసార్లు నెగెటివ్ ట్వీట్ లతో జనాలపై విరుచుకుపడుతుంటాడు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేసాడు. అక్కినేని అఖిల్ కి ఎంగెజ్మెంట్ ఫిక్స్ అయ్యి.... అఖిల్ ఎంగేజ్మెంట్ కార్డు కూడా వచ్చేసింది. ఇక అఖిల్ పెళ్ళికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఒక వ్యంగ్యమైన ట్వీట్ చేసాడు. అదేమిటంటే ‘బాబూ అఖిల్.. అసలు కెరీర్ అనేది మొదలవ్వక ముందే పెళ్లిలో మునిగిపోవాలని ఎందుకు అనుకుంటున్నావ్. నేనూ అలాగే చేశాను. అయితే నువ్వు ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేయవని అనుకుంటున్నా'నని ట్వీట్ చేశాడు. అయితే ఇలా ట్వీట్ చేసాడో లేదో అలా ఆ ట్వీట్ ని డిలీట్ చేసేసాడు వర్మ. ఎందుకో ఏమో తెలియదు కానీ వర్మ మాత్రం ఆ ట్వీట్ ని వెంటనే ట్విట్టర్ నుండి తొలిగించాడు. అసలు పెద్ద పెద్ద వాళ్లకే తన ట్వీట్స్ తో చుక్కలు చూపించిన వర్మ.. అప్పుడు తాను రాసిన ట్వీట్స్ ని డిలీట్ చెయ్యలేదు సరికదా ఎవరి బెదిరింపులకు లొంగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఖిల్ పెళ్లి ట్వీట్ ని తొలిగించడం వెనుక నాగార్జున.. వర్మ ని బాగా మందలించినట్లు వార్తలొస్తున్నాయి. నాగార్జునకి భయపడే వర్మ తన ట్వీట్ ని డిలీట్ చేసాడని అందరూ అనుకుంటున్నారు.