సింగం సీరీస్ ని సూర్య చితక్కొట్టేస్తున్నాడు. సింగం పార్ట్ 1 నుండి సూర్యలోని నటుడుని డైరెక్టర్ హరి పిండేస్తున్నాడు. తనకు ఏవిధమైన నటన కావాలో అది సూర్య నుండి రాబట్టుకుంటున్నాడు హరి. అసలు పార్ట్ 1 నుండి డైరెక్టర్ హరి స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన సూర్య ఎస్ 3 టీజర్లో సూర్య నటన పీక్ స్టేజ్ లో చూడొచ్చు. అసలు ఎవరికైనా ఆ ఎస్ 3 టీజర్ లో సూర్య ప్లేస్ లో సింహమే దర్శనమిస్తుంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతలా వుంది సూర్య కేరెక్టర్, నటన చూస్తుంటే. అసలు పోలీస్ అంటే ఇలానే ఉండాలని సింగం పార్ట్ 1 నుండి హరి ప్రతి ఒక్క పార్ట్ లో ఇంకా ఇంకా చూపిస్తూనే వున్నాడు. సింగం పార్టులు ఎన్ని వచ్చినా కూడా తనివితీరనంత విధం గా డైరెక్టర్ హరి సింగం సీక్వెల్స్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఎస్ 3 సినిమా అటు తమిళం లో ఇటు తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న కొద్దీ ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ టీజర్ లో అనుష్కని, శృతి హాసన్ ని చూపించి చూపించినట్టు చూపించాడు హరి. మొత్తం టీజర్ అంతా సూర్యతోనే లాగించేసాడు. టీజర్ మొత్తం సూర్య డైలాగ్స్ తోనే అదిరిపోయింది. సూర్య చెప్పే ఒక్కో డైలాగ్ సూపర్ అనేలా ఈ టీజర్ ని కట్ చేయించాడు హరి. ఇక ప్రతి ఫ్రెమ్ ని చాలా రిచ్ గా చూపించాడు, హారిస్ జైరాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దంచేసాడనే చెప్పాలి. ఇక ఎస్ 3 చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Click Here to See the S3 Teaser