Advertisementt

'ఖైదీ..' ఐటమ్ కత్తిలా వుంది..!

Tue 08th Nov 2016 08:38 PM
khaidi no 150,raai laxmi,raai laxmi item look in khaidi no 150,chiranjeevi,ram charan  'ఖైదీ..' ఐటమ్ కత్తిలా వుంది..!
'ఖైదీ..' ఐటమ్ కత్తిలా వుంది..!
Advertisement
Ads by CJ

మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమా కి సంబందించి ప్రతి ఒక్క విషయము ఆహా అనిపించే రీతిలో మీడియా పబ్లిసిటీ చేస్తుంది.  ఖైదీ నెంబర్ 150 కి సంబంధించి ఏ ఒక్క విషయం బయటికి వచ్చినా అది పెద్ద సంచలనాత్మక విషయం గా మీడియా గోరంతలు కొండంతలుగా చేసి చూపిస్తూ పిచ్చ పబ్లిసిటీ చేస్తుంది. ఇక వి.వి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో చిరుకి జోడిగా కాజల్ నటిస్తుండగా ఒక స్పెషల్ సాంగ్ లో లక్ష్మి రాయ్ నటిస్తుంది. ముందుగా ఐటెం సాంగ్ కోసం కెథెరిన్ ని ఎంపిక చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమెని తప్పించి ఆ ప్లేస్ లోకి లక్ష్మి రాయ్ ని తీసుకున్నారు. 

ఇక ఇప్పటికే లక్ష్మి రాయ్ ఐటమ్స్ లో ఇరగదీసేస్తుంది. అసలు టాలీవుడ్ లో హీరోయిన్స్ ఐటమ్స్ చేస్తూ మిగిలిన ఐటెం గర్ల్స్ కి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఇక ఇప్పుడు లక్ష్మి రాయ్ చిరు 150 చిత్రంలో ఐటెం భామగా ఛాన్స్ కొట్టేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమెకి ఈ ఆఫర్ రావడం నిజంగా లక్కే అని చెప్పాలి. ఆమెని ఖైదీ నెంబర్ 150 లో అలా ఎంపిక చేశారో లేదో ఇలా ఆమె ఆ సాంగ్ షూట్ లో జాయిన్ అయిపొయింది. ఇప్పుడు లక్ష్మి రాయ్ ఖైదీ ఐటెం సాంగ్ లుక్ ఒకటి బయటికి వచ్చింది. అసలు అలా లక్ష్మి రాయ్ ని చూస్తుంటే అందరిమతులు పోవడం ఖాయం. అంతలా ఎక్సపోజ్ చేసింది లక్ష్మి. ఇక లుక్ లోనే ఇలా ఉంటే మరి సాంగ్ లో ఇంకెలా వుందో అని అప్పుడే మెగా ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు.

ఇక లక్ష్మి రాయ్ చిరంజీవితో పోటీ పడి ఈ సాంగ్ లో నటించిందని చెబుతున్నారు. ఇక షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి విడుదల చెయ్యాలని ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ కృతనిశ్చయంతో వున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ