సంచలనాలకు మారు పేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు చాలా కసిగా చేస్తాడు. ఆయనకు సినిమానే లోకం. ఎప్పుడు సినిమానే ఆయనకు మత్తు. అందుకనే సమాజంలో సంచలనం రేపిన అంశాలతో ఎప్పటికప్పుడు ఆ ఘటనను తానే సినిమాగా చేస్తానంటూ వెల్లడిస్తుంటాడు. తాజాగా నయూంపై కూడా చిత్రం తీయాలన్న ఆకాంక్షను వెల్లడించాడు. ఇంకా కెసీఆర్ పైన కూడా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు వివరించాడు. ఇలా వర్మ చాలా తక్కున సమసయంలోనే తక్కువ బడ్జెట్ లో కూడా సినిమాలు చేసి సంచలనం రేపిన ఘటనలు ఉన్నాయి. మూడు రోజుల్లో, కేవలం మూడు కోట్లతో సినిమా తీసి విడుదల చేయగల సామర్థ్యం ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఎంత తక్కువ బడ్జెట్ లో సినిమా చేసినా, ఆయన స్టాండర్డ్స్ ఆ సినిమాలో తప్పుకుండా మెయింటైన్ చేస్తాడు. అలా చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా తీసే వర్మ ఇప్పుడు ఏకంగా ఓ సినిమాకు రూ.340 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం పేరు న్యూక్లియర్. ఇది హాలీవుడ్ కు సంబంధించిన చిత్రం. కాగా వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి అంతర్జాతీయ సినిమా అనే ఈ విషయాన్ని వర్మే స్వయంగా వెల్లడించాడు కూడాను. భూమి మీద యుద్దాలుగాని జరిగితే ఇక న్యూక్లియర్ బాంబులనే ఆయుధాలుగా చేసుకొంటారని, హిరోషిమా, నాగసాకీలపై జరిపిన అణుబాంబు దాడితో వందేళ్లకు కూడా ఆయా ప్రాంతాలు తేరుకోలేదని, అలాంటిది న్యూక్లియర్ బాంబు వాడినట్లుగా తెలిస్తే... ఇక ప్రపంచ పటంలోనే ఆ దేశం కనిపించకుండా పోతుందన్న కథాంశంతో తెరకెక్కించబోతున్న సినిమా ఇది. కాగా ఇది భారతదేశంతో పాటు అమెరికా, చైనా, రష్యాలలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవేళ రూ.340 కోట్ల బడ్జెట్ తో వర్మ సినిమా చేస్తే భారత దేశంలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కే తొలి చిత్రం ఇదే అవుతున్నట్లు తెలుస్తుంది. కాగా వర్మ న్యూక్లియర్ కు సంబంధించిన తాజా సమాచారం ఇదే. కానీ వర్మపై నమ్మకం ఉంచి ఇంత స్థాయిలో పెట్టుబడి పెట్టగల నిర్మాత ఎవరబ్బా అనే ఆరాతీస్తున్నారు సినీ జనాలు. అయితే సీఎమ్ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గట్స్ ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మాత్రమే ఇలాంటి సబ్జెక్ట్స్ ను డీల్ చేయగల సామర్ధ్యం ఉందని తెలుసుకున్న ఈ కంపెనీ డైరెక్టుగా వర్మను కలిసి సబ్జెక్టును వివరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య తెలుగులో సినిమాలు తీసి చప్పుబడ్డ వర్మ బాలీవుడ్ కి వెళ్లి సర్కార్ 3 తీసుకొంటున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా రూ.340 కోట్లతో వర్మ ఓ సినిమాను దక్కించుకున్నాడంటే... ఇది వర్మకి నిజంగా సంచలనాత్మక వార్తే. అయితే వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి సంచలనం రేపుతూ ఉంటాడు. ఈసారి ఇది నిజంగా రామ్ గోపాల్ వర్మ పంటను పండించే వార్తగానే చెప్పవచ్చు.