టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ అన్ని వుడ్ ల్లో కమెడియన్స్ గా వచ్చి హీరోలుగా మారిపోతున్నవారు చాలామందే వున్నారు. ఇందులో సునీల్, అలీ వంటి వారు వున్నారు. ఇందులో సునీల్ అయితే ఏకంగా కమెడియన్ పోస్ట్ కి టాటా చెప్పేసి హీరోగా సెటిల్ అయిపోయాడు. ఇక అలీ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే హీరోగా మారి తన కమెడియన్ పోస్ట్ ని భద్రపరుచుకున్నాడు. ఇంకా చాలామందే వున్నారు ఇలా కమెడియన్ గా వచ్చి హీరోలుగా మారిన వారిలో. ఇక ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే సప్తగిరి. సప్తగిరి కమెడియన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సప్తగిరి ఎక్సప్రెస్స్ సినిమా తో హీరో అవతారమెత్తాడు.
సప్తగిరి హీరో అవ్వడమే పెద్ద విశేషమైతే సప్తగిరి ఎక్సప్రెస్స్ ఆడియో కి పవన్ ని రప్పించడం మరో విశేషం. సప్తగిరి ఎక్సప్రెస్స్ ఆడియో వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించగా... పవన్ కూడా ఈ ఆడియో వేడుకకి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక సప్తగిరి ఎక్సప్రెస్స్ ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఏదో ఈ సినిమాలో సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడే తప్ప సప్తగిరి ఎక్సప్రెస్స్ చిత్రంలో సప్తగిరి మాత్రం కమెడియన్ అవతారంలోనే కనిపించనున్నాడని ఈ ట్రైలర్ చూసిన వారికి అర్ధమవుతుంది. ఫాస్ట్ డైలాగ్స్ తో సప్తగిరి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు ఈ ట్రైలర్ లో.
'ది చెడ్డీ మ్యాన్' అంటూ వల్లభ మూవీలో శింబు కేరక్టర్ ని ఇమిటేట్ చేస్తూ సప్తగిరి చేసిన కామెడీ పంచ్ ఈ సినిమాకి హైలెట్ అవుతుందనడంలో సందేహం ఉండదు. మరి కామెడీని నమ్ముకుని హీరోగా వస్తున్నా సప్తగిరిని అందరూ ఆదరిస్తారనే అనుకుందాం.