బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని చారిత్రక నేపథ్యం వున్న కథతో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పూర్తి చేయాలని క్రిష్ - బాలకృష్ణ ఇద్దరూ శ్రమిస్తున్నారు. సంక్రాంతి బరిలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని నిలబెట్టి బాలకృష్ణ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రాజమాతగా బాలీవుడ్ నటి హేమమాలిని, బాలయ్య భార్యగా శ్రీయ శరణ్ నటిస్తున్నారు.
షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ స్పాట్ కి సంబంధించి కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఆ పిక్స్ చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఈ ఫొటోస్ లో బాలకృష్ణ, శ్రీయ ఏదో కోయవాళ్ళ గెటప్స్ లో కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య రాజసం ఉట్టిపడేలా ఫస్ట్ లుని, సెకండ్ లుక్ ని క్రిష్ విడుదల చేసాడు. కానీ ఇప్పుడు బాలయ్య ఒక వెరైటీ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అసలు ఈ గెటప్ లో బాలయ్య ఎంతసేపు సినిమాలో కనబడతాడో అనే చర్చ బయలుదేరింది.
ఈ ఫొటోస్ తో ఎంతో ఆసక్తిని పెంచుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాని ప్రత్యేకించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పెషల్ షో వేయించి చూపించాలని బాలకృష్ణ, క్రిష్ అనుకుంటున్నారు. ఇక బాలకృష్ణ 100 వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి పోటీగా చిరు 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ని కూడా ఈ సంక్రాంతికే బరిలోకి దించుతున్నాడు. ఇంకా దిల్ రాజు నిర్మాణం లో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'శతమానం భవతి' ని కూడా ఈ సంక్రాంతికే విడుదల చెయ్యాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మరి సంక్రాంతి బరిలో నిలిచే ఈ మూడు చిత్రాల్లో గెలిచే చిత్రమేదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు.