Advertisementt

'దెయ్యం'తో 'సాహసం..' చేస్తున్నారు..!

Mon 07th Nov 2016 04:09 PM
allari naresh,intlo deyyam nakem bhayam,sahasam swasagaa saagipo movie,naga chaitanya  'దెయ్యం'తో 'సాహసం..' చేస్తున్నారు..!
'దెయ్యం'తో 'సాహసం..' చేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

వచ్చే శుక్రవారం న రెండు చిత్రాల మధ్య పోటీ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే 'ప్రేమమ్‌' సోలో హిట్‌ రూపంలో అక్కినేని వంశ వారసుడు నాగచైతన్య ఉన్నాడు. ఇక ఆయన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించిన 'ఏమాయ చేశావే' అనుభవం, గౌతమ్‌మీనన్‌, ఎ.ఆర్‌.రెహ్మాన్‌ వంటి వాటితో పాటు అక్కినేని వంశ వారసత్వం నాగచైతన్యకు ప్లస్‌ అవుతోంది. ఇక అదే రోజున వరుస ఫ్లాప్‌లలో ఉన్న అల్లరోడు తన చిత్రంతో రావాలని ఉబలాటపడుతున్నాడు. గతంలో అల్లరినరేష్‌కు 'సీమశాస్త్రి, సీమటపాకాయ్‌' వంటి హిట్‌ చిత్రాలను ఇచ్చిన దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 'అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో' వంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకున్న భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన ఎలాగైనా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే ధీమాలో ఉన్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత అల్లరినరేష్‌ అభిమానులతో పాటు అలీ చేసే భజన్‌లాల్‌ స్పూఫ్, దెయ్యం కథలను, మాస్‌ చిత్రాలను ఆరాధించే అభిమానులు కూడా ఈ చిత్రం వైపు ఆసక్తిగా చూస్తున్నారు.  'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రానికి ఏమాత్రం పోటీ ఇస్తుందోనని డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్‌ పడుతున్నారు. 'సాహసం...' చిత్రం బాగా ఆలస్యమైందని అది 'సాహసం... 'కు మైనస్‌ అవుతుందనేది మరికొందరు డిస్ట్రిబ్యూటర్ల భావన. చూద్దాం ఏం జరుగుతుందో..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ