సప్తగిరి హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి పవన్ కల్యాణ్ అతిథిగా వచ్చాడు. పవన్ కల్యాణ్ ఏదో రేర్ గా తప్పితే అంతగా ఆడియో ఫంక్షన్లకు వెళ్ళడం అస్సలు ఇష్టముండదు. ఇక సప్తగిరి వంటి వారి ఫంక్షన్లకు అంటే అస్సలు సమస్యే లేదు అనుకో. అలాంటిది సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకి పవన్ రావడం అంటేనే ఓ పెద్ద ట్విస్ట్. అది అందరూ ఆశ్చర్యపోయేంత ట్విస్టే మరి.
కానీ పవన్ కళ్యాణ్ ఆడియో మొదలయ్యేంతవరకు ఈ విషయం భలే ఆలోచించారు సినీ జనాలు. కానీ పవన్ స్పీచ్ లో ఆ విషయం విన్నాక ఓ అందుకా పవన్ వచ్చిందీ అంటూ గమ్మత్తుగా ఫీలయ్యారు. విషయం ఏంటంటే... సప్తగిరికి పవన్ చేసిన సాయం అంతా ఇంతా కాదట. మాటల్లో చెప్పలేనంత. చేతల్లో చూపలేనంత. ఏంటంటే.. పవన్ తాజాగా ‘కాటమరాయుడు’ అని ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ సప్తగిరి సినిమాకి పెట్టుకోవాలనుకున్న పేరంట. కానీ పవన్ కి ఆ టైటిల్ అంటే మోజు ఏర్పడటంతో.. ఆ టైటిల్ తనకు కావాలనుకున్నాడంట. అంతే సప్తగిరి.. పవన్ పై ఉన్న ఎంతో అభిమానంతో తన సినిమాకి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టుకొని ఆ కాటమరాయుడు పవన్ కి ఇచ్చేశాడంట. అదీ విషయం. ఇప్పుడర్థమైందిగా పవన్ ఇంతగా ఎందుకొచ్చాడనేది.
అలా పవన్ ఈ చిత్ర టైటిల్ ఇచ్చిన రుణం ఇలా తీర్చేసుకున్నాడన్న మాట. నిజానికి పవన్ కల్యాణ్ రావడంతోటే ఆ ఆడియో ఫంక్షన్ కి కల వచ్చేసింది. పవన్ రావడమే కాకుండా.. సప్తగిరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు కూడానూ. గబ్బర్ సింగ్‌లో సప్తగిరి చిన్న వేషం వేశాడు.. అది చూసి ఆయన్ని కలవాలనుకొన్నా. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఇలా అవకాశం వచ్చింది అంటూ… సప్తగిరిపై తనకున్న ‘అభిమానం’ చాటుకొన్నాడు పవన్ కల్యాణ్. అంతేకాకుండా.. కాటమరాయుడు టైటిల్‌ని అడిగిన వెంటనే ఇచ్చేసిన సప్తగిరి ఔదార్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. పవన్ మాట్లాడుతూ.. ‘టైటిల్ అడిగినందుకు నాకే సిగ్గుగా అనిపించింది. అయినా.. అడిగిన వెంటనే ఇచ్చినందుకు సప్తగిరికి కృతజ్ఞతలు’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు పవన్. ఇంకా పవన్ మాట్లాడుతూ.. తాను ఎక్కువగా సినిమాలు చూడనని, అయితే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా మాత్రం చూడాలనుకుంటున్నానని, అందుకని ఈ సినిమా విడుదలకు ముందు ప్రత్యేకంగా ఓ షో వేసుకొని ఈ చిత్రం చూస్తానని చెప్పాడు పవన్. మొత్తానికి సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకి పవన్ కళ్యాణ్ విచ్చేసింది అందుకన్నమాట. ఇదంతా చూస్తుంటే పంజా సినిమాలోని మెయిన్ డైలాగు గుర్తొస్తుంది. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపక పోవడం ఇంత తప్పో..సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. పవన్ మొదటిది చేసి చూపించాడు.