Advertisementt

బాహుబలి 3 కోసం టాప్ హీరోయిన్ కలలు!

Mon 07th Nov 2016 02:16 PM
bahubali 3,kajal agarwal,dream,ss rajamouli,anushka,tamanna  బాహుబలి 3 కోసం టాప్ హీరోయిన్ కలలు!
బాహుబలి 3 కోసం టాప్ హీరోయిన్ కలలు!
Advertisement
Ads by CJ

బాహుబలి పార్ట్ 1 సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసాడు డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి 1 లో ప్రభాస్ కి రానాకీ సమానమైన పాత్రలతో వారిని ప్రేక్షకులకి పరిచయం చేసిన రాజమౌళి హీరోయిన్స్ విషయంలో మాత్రం కథకి తగ్గట్టు అనుష్క పాత్రని డీ గ్లామర్ గా చూపించి తమన్నాని హైలెట్ చేసాడు. ఇక బాహుబలి పార్ట్ 2 లో తమన్నా ని కొద్దిగా చూపించి అనుష్క ని హైలెట్ చేశానని రాజమౌళిని చెప్పాడు. అంటే ఈ పార్ట్ లో అనుష్క పూర్తిగా సినిమా అంతా కనబడుతుంది. ఇక పార్ట్ 1 లో సినిమా అంతా కనిపించిన తమన్నాకి బాహుబలి 2 లో మాత్రం తక్కువ టైం ని కేటాయించాడు రాజమౌళి. ఇక బాహుబలి 2 అయిపోయిన తర్వాత వీలుని బట్టి బాహుబలి 3  ని కూడా చేస్తానని చెప్పాడు రాజమౌళి. 

మరి బాహుబలి 3  లో అనుష్కని, తమన్నాని కంటిన్యూ చేస్తాడా... లేక మరో హీరోయిన్ ని పెడతాడా అని అప్పుడే జనాలు తెగ ఆలోచిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని ఒక హీరోయిన్ బాగా కావాలనుకుంటుందని టాక్. ఇప్పటికే ఆ హీరోయిన్ రాజమౌళి చేసిన మగధీర చిత్రం లో యాక్ట్ చేసింది. ఆమె కాజల్. కాజల్ మగధీర చిత్రం లో మిత్రవిందగా ఎంతబాగా అలరించిందో తెలుసు. అయితే కాజల్ ని మళ్ళీ రాజమౌళి బాహుబలి పార్ట్ 1 లో ఏదైనా ఒక పాత్రకి తీసుకుంటాడని అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఒక్క  పాత్రకి కూడా కాజల్ ని సెలెక్ట్ చేసుకోలేదు. అసలు బాహుబలి మొదలు కాకముందే అనుష్కని మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసేసాడు. ఇక సినిమా మొదలయ్యాక సడన్ గా తమన్నని సెలెక్ట్ చేసేసుకున్నాడు. పాపం తమన్నా పాత్ర అయినా కాజల్ కి ఇస్తాడేమో అనుకుంది. కానీ కాజల్ ని కాదని తమన్నాని తీసుకున్నాడు. ఇక రెండో పార్ట్ లో వేరే హీరోయిన్ ని తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇక పార్ట్ 3  లోనైనా తనని ఒక పాత్రలో సెలెక్ట్ చేస్తారని ఆశపడుతోంది. 

ఇక బాహుబలి 3 లో గనక రాజమౌళి తనకు అవకాశం ఇస్తే కాజల్ ఎగిరి గంతేసి ఒప్పుకోవడానికి రెడీ గా వుంది. ఇక ఛాన్స్ గనక వస్తే వేరే సినిమాలు ఒప్పుకోకుండా రాజమౌళికి అడిగిన డేట్స్ ఇవ్వడానికి కాజల్ తయారుగా ఉందని అంటున్నారు. బాహుబలి వంటి సినిమాలో చెయ్యడం తనకి కలగా కూడా చెప్పుకొచ్చింది. మరి కాజల్ కోరికని రాజమౌళి తీరుస్తాడా... లేక పార్ట్ 3  లో మరో హీరోయిన్ కి అవకాశం ఇస్తాడో చాలా రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ