Advertisementt

నాగార్జున కొడుకులు, కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో..!

Mon 07th Nov 2016 01:35 PM
nagarjuna,naga chaitanya,samantha,akhil,shreya bhoopal  నాగార్జున కొడుకులు, కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో..!
నాగార్జున కొడుకులు, కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో..!
Advertisement
Ads by CJ

అక్కినేని వారసుల పెళ్లిళ్లు కుదిరిపోయాయి. వాళ్ళ భాగస్వాములను వాళ్లే వెతికేసుకున్నారు. నాగ చైతన్య.. సమంతని, అఖిల్.. శ్రీయ భూపాల్ ని సెలక్ట్ చేసేసుకున్నారు. చైతు సామ్ తో,అఖిల్ శ్రీయతో డీప్ లవ్ లో వున్నారు. ఇక వీరి పెళ్లిళ్లకి నాగార్జున దగ్గరనుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఇంకేముంది ఆఫీషియల్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ డేట్ కూడా వచ్చేసింది. ఇక నాగ చైతన్య -సమంత మాత్రం వచ్చే ఏడాది వరకు పెళ్లి చేసుకోమని చెప్పారు. అందుకే నాగార్జున ముందుగా అఖిల్ నిశ్చితార్ధం చేసేస్తున్నాడు. డిసెంబర్ 9 న అఖిల్ -శ్రీయ భూపాల్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అయితే ఇక ఈ ప్రేమ జంటలు మాత్రం విహార పక్షుల్లా విహరిస్తున్నాయి. ఇప్పటివరకు చైతు సామ్ లు, అఖిల్ శ్రీయాలు కలిసినా అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా కలిసేవారు. కానీ ఇప్పుడు మాత్రం పబ్లిక్ గా, స్వేచ్ఛగా తిరుగుతూ కనబడుతున్నారు. నాగ చైతన్య, అఖిల్ తమ తమ కాబోయే భార్యలతో పార్టీ లకు, పబ్ లకు జంటలుగా హాజరైపోతున్నారు. ఇక ఇలా ఒక ఫోటోకి కూడా ఫోజిచ్చారు వీళ్ళు. ఈ ఫొటోలో చైతు చెయ్యిని సమంత గట్టిగా పట్టుకుని వుంది. ఆ ఇద్దరి వెనుక అఖిల్, శ్రీయ భూపాల్ చాలా క్లోజ్ గా వున్నారు. ఇక ఈ ఫోటో ని చూసిన వారెవరైనా నాగార్జున కొడుకులు, కోడళ్ళు చూడ ముచ్చటగా ఉన్నారనే కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ