Advertisementt

హైపర్ టెన్షన్ తో పూరి..!

Mon 07th Nov 2016 01:15 PM
hero ram,puri jagannath,flop combo,hit,isam movie,star heroes  హైపర్ టెన్షన్ తో పూరి..!
హైపర్ టెన్షన్ తో పూరి..!
Advertisement
Ads by CJ

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇజం తర్వాత కొంత ఆలోచనలో పడ్డాడు. ఈ సమయంలో ఆయన కాస్తో కూస్తో హిట్ ఇచ్చే హీరో కోసం వెతుకులాడటం మొదలెడుతున్నాడు. ఈసారి పూరి కాస్త పేరున్న ఏ కుర్ర హీరోతోనైనా సినిమా చేయడానికి సంసిద్ధమౌతున్నట్లుగా తెలుస్తుంది. ఇజం సినిమాతో స్టార్ హీరోలతో సినిమా అంటే పూరి కాస్త దడుస్తున్నాడనే అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య మహేష్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల కోసం కాస్త ఎదురు చూసి, ఆ తర్వాత మళ్ళీ ఏమైందో కానీ, తాజాగా హైపర్ రామ్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది.  ఇజం సినిమాతో నిజంగా పూరి ఖంగుతిన్నాడనే అర్థమౌతుంది. 

అటునుంచి చూస్తే రామ్ కి తాజాగా విడుదలైన హైపర్ చిత్రం జలక్ ఇవ్వడంతో ఈ హీరో డీలపడినట్లుగానే తెలుస్తుంది. ఎనర్జిటిక్ హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని ఈ చిత్రంలో అంతగా పొందలేకపోయాడు రామ్. దీంతో ఎనర్జిటిక్ హీరో రామ్ ఇమేజ్ ను కంటిన్యూ చేయడం కోసం పూరితో సినిమా చేయాలనుకుంటున్నట్లు భావిస్తున్నాడు.  నేను శైలజతో ట్రాక్ లోకి పడ్డాడనుకున్న రామ్ హైపర్ తో మళ్ళీ డీలాపడిపోయాడు. దీంతో ఇప్పుడు రామ్ కి పూరి వంటి దర్శకుల అవసరం ఎంతైనా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు దర్శకుడు పూరి, మరో వైపు రామ్ కాంబినేషన్ హిట్ అగత్యం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరూ ఓ సినిమా చేసి హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా పూరీ దర్శకత్వంలో  రామ్ సినిమా చేయడానికి మంచి ఉత్సాహం చూపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకోసం పూరీతో రామ్ కలిసి చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది.  వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ దాదాపుగా ఖాయం అయినట్లుగానే అర్థమౌతుంది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ఇద్దరికీ మరింత అవసరంగా పరిశ్రమలో టాక్ కూడా వినిపిస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ