శతాధిక చిత్ర నిర్మాత, గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పిన ప్రొడ్యూసర్, సురేష్ మూవీస్ అధినేత డాక్టర్ డి.రామానాయుడు కొంత కాలం కిందట కాలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు కూడా జరగకముందే మన టాలీవుడ్‌లోని రూమర్ల రాయుళ్లు ఆయన కుమారులు, నిర్మాత డి.సురేష్‌బాబు, హీరో విక్టరీ వెంకటేష్‌లు తమ తండ్రి ఆస్దిలో ఎక్కువ వాటా కోసం పట్టుబట్టి, గొడవపడ్డారని, ప్రస్తుతం పెద్ద మనుషుల ద్వారా చర్చలు జరుపుతున్నారని వార్తలు పుట్టించారు. ఇంతకాలం తన అన్నయ్యతో కలిసి ఉన్న హీరో విక్టరీ వెంకటేష్ తాను ఫిల్మ్‌నగర్‌లో ఇంతకాలం ఉన్న ఇంటిని కమర్షియల్ రెంట్‌కి ఇచ్చాడని... తనకు వాటా కింద వచ్చే దాని పక్కన ఉన్న ఖాళీ స్దలాన్ని కూడా ఐస్‌క్రీం పార్లర్‌కు రెంట్‌కు ఇచ్చి, తనకు అనుకూలంగా, ఆహ్లాదంగా, తన అభిరుచికి తగ్గట్లుగా నిర్మించుకున్న మణికొండలోని తన సొంత ఇంటికి వెళ్లాడట. అక్కడ ఆయన నాలుగెకరాల స్ధలంలో తన ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో గాసిప్ రాయుళ్లకు ఇప్పుడు మరో సదావకాశం వచ్చింది. అయితే ఇక్కడ అనుమానించాల్సింది ఏమీ లేకున్నా తన తండ్రి ఆస్దులు, ఉమ్మడి ఇంటి నుండి వెంకీ వెళ్లిపోవడం, ఆయన మణికొండలో కొత్త ఇంటిని నిర్మిస్తున్న విషయం... ఇలా అన్నీ చర్యలు గాసిప్ రాయుళ్లు చెప్పినట్లే జరగడంతో ఈ వార్తలను నమ్మాల్సివస్తోందని, నిప్పు లేనిదే పొగ రాదు కదా..! మన గాసిప్, రూమర్‌రాయుళ్ల మాటల్లో కూడా నిజాయితీ కనిపిస్తోందంటూ ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలను మనం నమ్ముదామా? వద్దా?