Advertisementt

పవన్ ఫ్యాన్స్ ని ఇంక పట్టుకోగలరా..!

Sun 06th Nov 2016 05:01 PM
pawan kalyan,trivikram,katamarayudu,pawan fans  పవన్ ఫ్యాన్స్ ని ఇంక పట్టుకోగలరా..!
పవన్ ఫ్యాన్స్ ని ఇంక పట్టుకోగలరా..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలు జరిపేసుకుంది. ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా సినిమాని మొదలెట్టేసినా... పవన్ కాటమరాయుడు సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటాడని సమాచారం. ఇక పవన్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా దేవుడే దిగివచ్చిన అని పెట్టారని సమాచారం. అయితే ఈ పూజా కార్యక్రమాలను అట్టహాసం గా చెయ్యకుండా కేవలం కొంతమంది అతిధుల మధ్య కానిచ్చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలను త్రివిక్రమ్ ఇప్పటికే పూర్తి చేసాడని సమాచారం. ఒక్క నటీనటుల ఎంపిక తప్ప మిగతా విషయాలన్నీ పూర్తయ్యాయని సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు ఈ దేవుడే దిగివచ్చిన(వర్కింగ్ టైటిల్) సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇక ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ వచ్చే మే లో రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ మళ్ళీ నటించడంతో పవన్ ఫాన్స్ పిచ్చ హ్యాపీగా వున్నారని టాక్. అది కాకుండా..ఇప్పటి వరకు పవన్ కెరీర్ లోనే లేనిది వరుసగా 3 చిత్రాలతో పవన్ బిజీ గా ఉండటం తో..తమ హీరో లైన్ లోకి వచ్చాడని..ఇంక ఆపడం ఎవరితరం కాదని..పవన్ ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారు. పవన్ మాములుగా వున్నప్పుడే..ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం. మరి..ఇలాంటి హ్యాపీ న్యూస్ లు వస్తుంటే..అసలు వారిని ఆపగలరా..!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ