మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి, పార్లమెంట్ సభ్యుడయిన మెగాస్టార్ చిరంజీవి ఈమద్య కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో అసలు పాలుపంచుకోవడం లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గానీ, వారి అనుయాయులు గానీ ప్రశ్నించడం లేదు. దీనికి కారణం చిరంజీవికి ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానమే స్వేచ్చ ఇచ్చిందని సమాచారం. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ తురుపుముక్క చిరంజీవియేనని అధిష్టానానికి తెలుసు. ఆ సమయంలోపు చిరంజీవి ఎన్ని సినిమాలు చేసి, తన పాత అభిమానులను ఎంతగా వీలుంటే అంతగా పెంచుకోవడానికి ఆయనకు ఒక్కడికే అవకాశం ఉంది. ఇది మిగిలిన కాంగ్రెస్ ప్రస్తుత నేతల వల్ల కాదు. దాంతో ఎన్నికలలోపు చిరంజీవి తన అభిమానగణాన్ని ఆకట్టుకుని మరలా సరికొత్త మెగాస్టార్‌ను పార్టీ ఎన్నికల నాటికి చిరును తయారుచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ జనసేన కార్యక్రమాలకు రాష్ట్రంలో మంచి స్పందన వస్తోంది. దీనితో ఎన్నికల నాటికి పవన్‌తో పాటు మరికొందరు మెగాహీరోలను కూడా రాజకీయంగా వాడుకొనే ముందస్తు వ్యూహంలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. మరోపక్క ఈ మధ్య చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరుతాడని వార్తలు వచ్చాయి. కానీ అవి వాస్తవం కాదని తేలింది. ఇక ఇప్పుడు పవన్ స్దాపించిన జనసేన పార్టీ ఎన్నికల నాటికి చిరును కూడా ఒప్పించి ఆయనను సీఎం అభ్యర్దిని చేసే అవకాశాలు ఉన్నాయని సైతం ప్రచారం జరుగుతోంది. కానీ ఇదీ నిజమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం చిరంజీవి ప్రతిష్టాత్మకమైన 150వచిత్రం 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి భారీ హైప్ తేవడానికి నిర్మాతైన ఆయన తనయుడు రామ్‌చరణ్ చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. మిగిలిన టాప్‌హీరోల మాదిరే చిరు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టే స్దాయిలో జరగాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన సినీగ్లామర్ కోల్పోయిన అభిమానులు ఆయన్ను మరలా అదే రేంజ్‌లో ఆదరిస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కానీ ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ తర్వాత భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయమని మెగాక్యాంపు భావిస్తోంది. అందుకే ప్రస్తుతం వారు 'ఖైదీ నెంబర్ 150'కి ఫాల్స్ స్ట్రాటర్జీని ఫాలో అవుతున్నారని, కానీ ఈ మంత్రం ఎక్కువగా ఫ్లాప్ కావడానికి దారితీస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.