మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు లాగా కెరీర్ లో ఎదగలేక ఇబ్బందులు పడుతున్నాడు. వరస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నవిష్ణు దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలతో ఫామ్ లోకొచ్చాడు. ఆ సినిమాల తర్వాత మళ్ళీ ప్లాపులు వెంటాడాయి విష్ణుని. ఇక ఈ సంవత్సరం లో వచ్చిన ఈడోరకం ఆడోరకం కాస్త పర్వాలేదనిపించింది. ఆ సినిమాలో కామెడీ పరంగా విష్ణు ఓకె అనిపించాడు. ఇక ఆ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని రాజ్ కిరణ్ డైరెక్షన్ లో లక్కున్నోడు సినిమా మొదలెట్టాడు. ఈ సినిమా ప్రీ లుక్ ని ముందు విడుదల చేసి, ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో మంచు విష్ణు చుట్టూ డబ్బు కట్టలతో.... హీరోయిన్ హన్సిక తో పాటు కనిపించాడు. హన్సిక కూడా నోట్ల కట్టలతో విష్ణు కూర్చున్న కుర్చీ మీద చెయ్యి వేసి నిల్చుంది. ఇక వీరిద్దరూ డబ్భుతో ఆడుకున్నట్లుంది ఈ లక్కున్నోడు పోస్టర్ చూస్తుంటే. అసలు ఆ సినిమా టైటిల్ నే లక్కున్నోడు అని పెట్టిన విష్ణు ఈ పోస్టర్స్ లో నిజంగానే విష్ణుని లక్కు వరించినట్లు అనిపిస్తుంది. విష్ణుని లక్కు వరించి డబ్బు కుప్పలుతెప్పలుగా వచ్చిపడిందనేలా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు చిత్ర యూనిట్ వాళ్ళు. ఇక హన్సిక మూడోసారి ముచ్చటగా మంచు విష్ణుతో జోడి కడుతుంది. ఇప్పటివరకు వీరు దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలలో నటించారు. ఇక ఇప్పుడు మరోసారి లక్కున్నోడులో జంటగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ అయితే మంచిగానే వుంది..మరి సినిమాలో మేటర్ పరిస్థితి ఏమిటో గాని..ఈ సినిమా హిట్ అవ్వడం మాత్రం మంచు విష్ణు కి చాలా ఇంపార్టెంట్ మరి.