బాలీవుడ్ మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమితాబ్ బచ్చన్, భార్య జయా బచ్చన్, కొడుకు, కోడలు అందరూ కూడా ఎవరికివారు విభిన్నంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా అమితా బచ్చన్ కూతురు తాజాగా శ్వేతా బచ్చన్ నందా ఓ ఫ్యాషన్ షోలో మెరిసింది. ముంబైలో జరిగిన ఈ ఫ్యాషన్ షో కార్యక్రమంలో శ్వేత బచ్చన్ నందా తెల్లని వస్త్రాలు ధరించి తళుక్కున మెరిసి ర్యాంప్ వాక్ తో చూపరులను అమితంగా ఆకట్టుకుంది. కాగా 42ఏళ్ళ వయసులో కూడా తన అందచందాలతో శ్వేతా ఒయ్యారంగా వంకరలు తిరుగుతూ ఆ షో లో టాపర్ గా నిలిచింది.
కాగా శ్వేతా బచ్చన్ నందా ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులైన జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ విచ్చేశారు. అంతేకాకుండా అభిషేక్ బచ్చన్ కూడా ఈ ఫ్యాషన్ కార్యక్రమానికి విచ్చేసి సోదరీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. తండ్రి అమితాబ్ బచ్చన్ ఎంతో మురిసిపోతూ... శ్వేత ఆ ఫ్యాషన్ షోలో నడుస్తున్నప్పుడు ఫోటోలను తన మొబైల్ ద్వారా తీస్తూ వీడియోలు కూడా తీసేసి తన సొంత ముబైల్ లో బంధించుకున్నాడు. అభిషేక్ బచ్చన్ షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కాస్త తీరిక చేసుకొని ఈ కార్యక్రమానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంకా ఈ ఫ్యాషన్ షో కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ కుటుంబంతో పాటు బాలీవుడ్ నటి సోనాలి బేంద్రే, దర్శకుడు అభిషేక్ కపూర్, ఆమె భార్య ప్రగ్నా యాదవ్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు పాల్గొనడం విశేషమనే చెప్పాలి. కాగా ఈ ఫ్యాషన్ షోలో శ్వేతా టాపర్ గా నిలవడం అందరినీ ఎంతో ఆనందానికి లోను చేసింది.