Advertisementt

అక్కినేని పాలసీ అర్థమైందా..!

Sat 05th Nov 2016 07:29 PM
akkineni nageswara rao,manam,akkineni policy,nagarjuna,naga chaitanya,sushanth,naruda donoruda,sumanth,akhil  అక్కినేని పాలసీ అర్థమైందా..!
అక్కినేని పాలసీ అర్థమైందా..!
Advertisement
Ads by CJ

తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తాను, తన కుమారుడు నాగచైతన్యలతో కలిసి నాగార్జున 'మనం' చిత్రం చేశాడు. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలుసు. కాగా ఈ చిత్రంలో అక్కినేని అఖిల్‌ను మొదటి సారిగా పెద్ద స్క్రీన్‌కు పరిచయం చేస్తూ అఖిల్‌పై ఉన్న క్రేజ్‌ను ఈ చిత్రానికి సైతం నాగార్జున వాడుకున్నాడు. దానికి బదులుగా అన్నట్లు అఖిల్‌ చేసిన మొదటి చిత్రం 'అఖిల్‌'లో ఓ పాటలో నాగార్జున అఖిల్‌తో కలిసి ఓ పాటలో స్టెప్పులు వేసి, సినిమా ఫ్లాపయినా అభిమానులను అలరించారు. ఇక ఆ తర్వాత నాగచైతన్య చేసిన 'ప్రేమమ్‌' చిత్రంలో నాగచైతన్య కోసం ఓ పాత్రలో నాగ్‌ కనిపించాడు. ఇదే చిత్రంలో వెంకటేష్‌ సైతం నటించిన సంగతి తెలిసిందే. ఇక తమ ఫ్యామిలీ హీరో సుశాంత్‌ నటించిన 'ఆటాడుకుందాం...రా' చిత్రంలో సైతం ఇద్దరు అక్కినేని హీరోలు, ఇప్పుడు తాజాగా వచ్చిన సుమంత్‌ 'నరుడా.. డోనరుడా' చిత్రంలో సైతం నాగ్‌, చైతులు అతిధులుగా కనిపించి ఆయా చిత్రాలకు క్రేజ్‌ రావడానికి సిద్దమయ్యారు. మరి అక్కినేని వారి ఈ ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఈ మధ్య పీక్స్‌కు వెళ్లిందని కొందరు అక్కినేని కుటుంబ హీరోలపై సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ