Advertisementt

ఈ నెలలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు..!

Sat 05th Nov 2016 07:02 PM
pawan kalyan,trivikram srinivas,mahesh babu,koratala siva,november,star heroes  ఈ నెలలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు..!
ఈ నెలలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఎంతటి సంచలనమో అందరికి తెలుసు. జల్సా తో పవన్ ని నిలబెట్టిన త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చి పవన్ కళ్యాణ్ ని నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టాడు. వీళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ  ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూసేలా చేశారు ఆ ఒక్క హిట్ సినిమాతో. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని కాచుక్కూర్చున్నాడు. పాపం పవనేమో రాజకీయాలంటూ బిజీ అవ్వడంతో వీరి కాంబినేషన్ లో మూవీ ఉండదేమో అని అనుకుంటున్న టైం లో అనూహ్యం గా వీరి కాంబినేషన్ సినిమా తెర పైకి వచ్చింది. మరి త్రివిక్రమ్.. పవన్ కోసమే చాలా రోజులు సినిమాలు చెయ్యకుండా ఖాళీ అయ్యి మరీ ఎదురు చూసిన ఎదురు చూపులకి ఇప్పుడు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. పవన్ - త్రివిక్రమ్ కాంబో మూవీ నవంబర్ 5 న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇప్పటికే పవన్.. కాటమరాయుడు షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కించి జెట్ స్పీడులో సినిమాలు చేసేయాలని అనుకుంటున్నాడు. 

ఇక మరో క్రేజీ కాంబినేషన్ మహేష్  - కొరటాల సినిమాకి కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్టయ్యి ఇండస్ట్రీ  టాప్ 2 లో  కూర్చుంది. మళ్ళీ కొరటాల శివ కూడా మహేష్ తోనే సినిమా  చెయ్యాలని ఆశపడి మళ్ళీ మహేష్ నే పట్టాడు.  ఏ హీరోతో చెయ్యడం పెద్దగా ఇష్టం లేదేమో మరి కొరటాలకి. మళ్ళీ మహేషే కావాలని పట్టుబట్టి మరీ ఒక మాంచి కథతో మహేష్ ని కలిసి అతనితో సినిమా ఓకే చేయించుకున్నాడు. కొరటాల ఇప్పటి వరకు తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు కొరటాల - మహేష్ కాంబో మీద కూడా భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమా కూడా ఎప్పుడెప్పుడు మొదలెడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇంక్లూడింగ్ కొరటాలతో సహా. ఇక వీరి కాంబినేషన్ మూవీ కి కూడా ముహూర్తం సెట్ అయిందనీ.... అది ఈ నవంబర్ 9 న అని చెబుతున్నారు. ఇక మహేష్, మురుగదాస్ సినిమాతో బిజిగా వున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాగానే మహేష్, కొరటాల సినిమా షూటింగ్ లోకి దూకుతాడని అంటున్నారు.

ఏది ఏమైనా రెండు క్రేజీ కాంబినేషన్స్ మూవీస్ ఒకే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోవడం విశేషం. ఇక ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను పలకరిస్తాయో గాని అప్పటివరకు ఈ సినిమాలకి సంబంధించి ఏ న్యూస్ బయటికి వచ్చినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరీ క్రేజీ కాంబినేషన్స్ మూవీస్ కదా అలాగే  ఉంటుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ