చాలా చాలా గ్యాప్ తర్వాత 'ప్రేమమ్' తో హిట్ కొట్టాడు నాగచైతన్య. బావుందని టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్లు ప్రారంభంలో బావున్నప్పటికీ, సరైన ప్రచారం లేని కారణంగా చతికిలపడ్డాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చైతు హిట్ ను క్యాష్ చేసుకోవడానికి అన్నపూర్ణ స్టూడియో సైతం సరైన ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. మలయాళంలో టాప్ గ్రాసర్ గా నిలిచిన 'ప్రేమమ్' తెలుగులో మాత్రం ఆస్థాయి విజయానికి చేరుకోలేకపోయిందనేది వాస్తవం. ప్రస్తుతం ఒక మోస్తారు కలక్షన్లతో రన్ అవుతున్న'ప్రేమమ్' కు 'అల్లరి' నరేష్ చెక్ పెడుతున్నాడు. 'ప్రేమమ్' ప్రదర్శిస్తున్న థియేటర్లను 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా కోసం కన్ ఫర్మ్ చేశారు. ఈనెల 11 వ తేదీ నుండి చైతు సినిమా ఎత్తేస్తారన్నమాట. అక్టోబర్ 7న విడుదలైన నవంబర్ 10 వరకు అంటే 33 రోజుల ప్రదర్శనతో సరిపెట్టుకుంది 'ప్రేమమ్'.