ఫేస్ బుక్, ట్విట్టర్లో సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే వుంటారు. కొంతమంది సెలబ్రిటీస్ అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాము చేసే పనులను ఎప్పటికప్పుడు అభిమానులకు చేరవేస్తూ వుంటారు. అసలు కొంతమంది సెలబ్రిటీస్ కి సోషల్ మీడియానే మంచి ఫ్రెండ్. ఇంకా కొంతమంది ట్విట్టర్, ఫేస్ బుక్ లేకపోతే తెగ ఫీలైపోతుంటారు. మరికొంతమంది తమ తమ సినిమా అప్ డేట్స్ ను అందిస్తూ ఫుల్ జోష్ లో వుంటారు. ఇక కుర్ర హీరో, హిరోయిన్సే కాదు సీనియర్ హీరో, హీరోయిన్స్ కూడా ఇలా సోషల్ మీడియాతో తమ ముచ్చట్లు పంచుకుంటూ ఉంటారు.
ఇక ఈ సీనియర్ హీరోస్ సరసన చేరేందుకు మరో స్టార్ హీరో తహతహలాడుతున్నాడట. ఆయనెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ కి ఇప్పటి వరకు ట్విట్టర్ లో అకౌంట్ లేదంట. మరి ఇప్పటిదాకా రాజకీయాల్లో, సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదేమో గాని ఇప్పుడు మాత్రం అందరికి మరింత చేరువ కావడానికి ట్విట్టర్ లో అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాడట. ఇప్పటిదాకా ట్విట్టర్ లో అకౌంట్ అయితే లేదుగాని ఫేస్ బుక్ లో మాత్రం నందమూరి బాలయ్యకి ఒక పేజీ వుంది.
అయితే ఈ ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేయాల్సిందిగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర దర్శక నిర్మాతలు బాలకృష్ణ ని కోరినట్లు వార్తలొస్తున్నాయి. ఇక వారి కోరికని మన్నించిన బాలయ్య ట్విట్టర్ అకౌంట్ ని తెరవడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇక ఈ అకౌంట్ ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణి ని బాగా ప్రమోట్ చెయ్యొచ్చని వారి ప్లాన్ కాబోలు. ఇక దీనికి బాలకృష్ణ ఒప్పుకోవడం కూడా వారికి మరింత సంతోషాన్నిచ్చిందని అంటున్నారు.