Advertisementt

ఈ సూపర్ స్టార్ ని చూసి భయపడుతున్నారు!

Sat 05th Nov 2016 01:28 PM
mohan lal,oppam,manyam puli,pulimurugan,mohan lal movies  ఈ సూపర్ స్టార్ ని చూసి  భయపడుతున్నారు!
ఈ సూపర్ స్టార్ ని చూసి భయపడుతున్నారు!
Advertisement
Ads by CJ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన చిత్రాలన్నీ హిట్ కావడం మరో సెన్సేషన్. తెలుగు, మలయాళం భాషల్లో తనదైన స్టయిల్లో దూసుకుపోతున్న ఈ స్టార్ గత రెండు నెలలుగా దాదాపు 3  చిత్రాల ద్వారా 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. మోహన్ లాల్ చేసిన తెలుగు చిత్రం మనమంతా డబ్బు తీసుకురాకపోయినా బోలెడు పేరు సంపాదించి పెట్టింది. ఇక అదే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్టో తెలిసినదే. ఇక ఈ సినిమాతో కలెక్షన్స్ మోత మోగించడం మొదలు పెట్టిన మోహన్ లాల్  మళ్ళీ... మలయాళం లో ఒప్పం తో కోట్లు కొల్లగొట్టాడు.  ప్రియదర్శన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒప్పం చిత్రం అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. ఇక చిత్రంపై అన్ని భాషల కళ్లు పడ్డాయి. ఇక ఒప్పం చిత్రాన్ని రీమేక్ చేయడమా లేక డబ్బింగ్ చేసి రిలీజ్ చెయ్యడమా అని తెగ ఆలోచిస్తున్నారు. ఇక కొంచెం గ్యాప్ తో విడుదలైన పులి మురుగన్ విజయ పరంపరతో దూసుకుపోతుంది. ఈ సినిమా కూడా కోట్లు కొల్లగొడుతూ మిగతా యాక్టర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇక ఈ వయసులో ఇలా మోహన్ లాల్ చెలరేగిపోయి కోట్లు కొల్లగొడుతుంటే యంగ్ స్టార్స్ మాత్రం మోహన్ లాల్ ని చూసి భయపడిపోతున్నారట. మోహన్ లాల్ నెలల వ్యవధిలోనే దాదాపు 200 కోట్లు కొల్లగొట్టడం సామాన్యమైన విషయం కాదు. పులి మురుగన్ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారట. ఈ సినిమా తెలుగులో మన్యం పులిగా రానుంది. ఇక మోహన్ లాల్ ప్రభంజనం చూసిన మిగతా  స్టార్స్ కి కంటి మీదకి  కునుకు రావడం లేదంట. అది మోహన్ లాల్ లో మ్యాటర్.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ