నితిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కొన్ని సినిమాల హిట్స్ తో బాగానే వున్నాడు. కానీ తర్వాత వచ్చిన ప్లాప్ లకి నితిన్ కెరీర్ సమస్యల్లో పడింది. ఇక హీరోగా నితిన్ రాడేమో అనుకుంటున్న టైం కి ఇష్క్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ హీరోగా సెటిల్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు హిట్, ప్లాప్ అయినప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యన వచ్చిన 'అఆ' సినిమాతో నితిన్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందుకుని అబ్బో అనిపించాడు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు కావొస్తున్నా నితిన్ మరో సినిమాని పట్టాలెక్కించలేదు. కానీ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా ఉంటుందని అనౌన్స్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు మొదలుపెట్టి షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా కంప్లీట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఉంటుందని అంటున్నారు.
'అ ఆ' సినిమాని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించడం... ఆ సినిమా హిట్ కావడంతో నితిన్ ఇప్పుడు చెయ్యబోయే సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి భారీ అంచనాలున్న ఈ ఈసినిమాలో నితిన్ కి జోడిగా ఒక స్టార్ హీరోయిన్ నటిస్తే బావుంటుందని నిర్మాతలు, డైరెక్టర్ అనుకుంటున్నారని సమాచారం. ఇక ప్రేమమ్ హిట్ తో జోరుమీదున్న శృతి హాసన్ అయితే నితిన్ పక్కన బాగుంటుందని అనుకుని... ఆమెను అప్రోచ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మరి శృతి ఏమో ఇప్పటికే తన తండ్రి శభాష్ నాయుడు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో, సూర్య సింగం సిరీస్ సింగం 3 లో హీరోయిన్ గా నటిస్తుంది. మరి మూడు భారీ చిత్రాల్లో చేస్తున్న శృతి.. నితిన్ పక్కన నటించడానికి ఒప్పుకుందని టాక్. అయితే తాను చేసే చిత్రాలకు డేట్స్ ప్రాబ్లెమ్ లేకపోతేనే నితిన్ సినిమాలో చేస్తానని చెప్పిందని అంటున్నారు. ఇక నితిన్ భవిష్యత్తు మాత్రం శృతి చేసే ఆ మూడు సినిమాలపై ఆధారపడిందన్నమాట.