ప్రముఖ సంచలన పాత్రికేయుడు టైమ్స్ నౌ ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి తాజాగా ఆ సంస్థకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా అర్నాబ్ రాజీనామా వెనుక చాలా చరిత్ర ఉన్నట్లుగానే తెలుస్తుంది. అర్నబ్ గొప్ప పటిష్టమైన భావాలు కలిగిన మంచి వాగ్దాటి గల వ్యక్తి అని గుర్తించిన భాజపా అందుకు తగిన స్కెచ్ ను రూపొందించుకున్నట్లుగానే తెలుస్తుంది. అర్నబ్ టైమ్స్ నౌ సంస్థ వీడ్కోలు సందర్బంగా ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛపై నమ్మకం కోల్పోవద్దంటూ సహోద్యోగులకు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన మాటల్లో చాలా ఉద్వేగం కనిపించింది. అంతే స్థాయిలో భవిష్యత్తు ప్రణాళిక, ఒక భరోసాతో కూడిన జీవితం ఉండబోతుందన్న ఆనందం కూడా తొనికిసలాడింది.
ఇంకా ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇండిపెండెంట్ మీడియా గురించి ఎవరూ బోధించరూ, దాన్ని స్వతంత్రంగా నేర్చుకోవాల్సిందేనంటూ ఆయన సూచించాడు. కాగా టైమ్స్ నౌ కు రాజీనామా చేసిన అర్నబ్ తన తర్వాత అడుగు ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ అతను మకాం బెంగుళూరుకు మార్చి అక్కడ రాజీవ్ చంద్రశేఖర్ అనే రాజ్యసభ సభ్యుడితో కలిసి ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాజీవ్ చంద్రశేఖర్ కూడా భాజపాతో సన్నిహితంగా ఉండటంతో అసలు అర్నబ్ గోస్వామి బయటకు రావడానికి భాజపా ఆలోచనలో భాగమేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. కాగా మొత్తానికి..దక్షిణ భారతీయ భాజపా సంచలనానికి అర్నబ్ అడుగులు దారితీయబోతున్నాయా అనే విషయం కూడా దీన్ని బట్టి అర్ధమౌతున్న అంశం.