Advertisementt

చంద్రబాబు సర్కార్ కు మరో దెబ్బ.!

Fri 04th Nov 2016 09:27 PM
sc,st chairman karem shivaaji,karem sivaji,highcourt fire on ap government  చంద్రబాబు సర్కార్ కు మరో దెబ్బ.!
చంద్రబాబు సర్కార్ కు మరో దెబ్బ.!
Advertisement
Ads by CJ
నూతనంగా ఏర్పాటుకానున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ సర్కార్ పలుమార్లు  హైకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమరావతి రాజధాని విషయంలో స్విస్ ఛాలెంజ్ అంటూ రహస్య ఎజెండాను అమలు చేసినప్పుడు ఉన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి హైకోర్టు ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఏపీకి ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ గా కారెం శివాజీ పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పదవికి సంబంధించి చైర్మన్ ఎంపిక విషయంలో ప్రభుత్వం నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు ఆగ్రహించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ కు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా కారెం శివాజీ అప్పట్లో ప్రత్యేక హోదా అంటూ ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఆయన ఉద్యమ దాడిని తట్టుకోవడానికి బాబు మెల్లిగా పిల్చి కారెం శివాజీకి ఎస్సీ, ఎస్టీ చైర్మన్ పదవిని కట్టబెట్టి అలా వారి వేడిని చల్లార్చాడు. కానీ ఆ పదవిని కట్టబెట్టడంలో బాబు సర్కార్ ఎలాంటి నిబంధనలను పాటించలేదంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయ వేయడంతో బాబుకు దిమ్మతిరిగినట్లయింది. మొత్తానికి  ఈ దెబ్బతో ప్రభుత్వం అప్పీలుకు కూడా అవకాసం లేకుండా పోయింది. ఇక కారెం శివాజీ పదవి ఉస్ కావడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ చంద్రబాబు సర్కార్ కు ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్నా ఏమాత్రం జంకకుండా ముందుకు పోతున్నాడు చూడు అదీ గ్రేట్.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ