Advertisementt

ఈ నేతకు ఎటు పోవాలో తెలియడంలే.!

Fri 04th Nov 2016 08:27 PM
konatala ramakrishna,konatala,peoples leader konatala in dielama  ఈ నేతకు ఎటు పోవాలో తెలియడంలే.!
ఈ నేతకు ఎటు పోవాలో తెలియడంలే.!
Advertisement

వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారికి వీర విధేయుడుగా ఉన్న కొణ‌తాల రామ‌కృష్ణ‌ ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితానికి అస్థిరత ఏర్పడిందనే చెప్పాలి. ఏ పార్టీలోనూ ఇమడలేక పోతున్నాడు. కాగా ఈ మ‌ధ్య చాలా కాలం నుండి కొణతాల ఏ పార్టీలోనూ లేకుండా ఊరక ఉండిపోయాడు. ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలను నెరపాలన్న తలంపుతో ఉన్న కొణతాల ప్ర‌త్యేక హోదాపై ఓ వినూత్న కార్య‌క్ర‌మాన్ని శ్రీకారం చుట్టాడు. ఈనెల 9న అన‌కాప‌ల్లి కేంద్రంగా చాయ్ చ‌ర్చా కార్య‌క్ర‌మాన్ని చేపట్టనున్నాడు కొణతాల. ఇందులో భాగంగా ప్రత్యేక హోదాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు టీ దుకాణాల్లో చ‌ర్చ పెట్టాల‌ని డిసైడైపోయాడు. ఇదీ ఓ రకమైన రాజకీయాల్లో భాగంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నా, ఏదో ఒక పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలు నెరపడానికి ఇది బాగా ఉపయోగపడుతుందనేది కూడా అందరికీ తెలుస్తున్న అంశం. ఉత్త‌రాంధ్ర‌ అంతటా అంటే ప‌ట్టణాలూ, ప‌ల్లెల్లో ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మం జరుపుతామని ఇటీవ‌లే కొణ‌తాల ప్ర‌క‌టించాడు.

మొత్తానికి చాయ్ చర్చా కార్య‌క్ర‌మం ద్వారా ఎలాంటి నిర్ణాయాలు తీసుకోనున్నాడన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఏ పార్టీలోకి ప్రవేశించే నిమిత్తం ఇది జరుపుతున్నాడు.? లేకా పార్టీలకతీతంగా ముందుకు పోయి అలా తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నాడా? లేకా, ప్రత్యేక హోదా విషయంపై చాలా స్పష్టతతో ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ఇలాంటి జనచైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాడా.? తిరిగి మళ్ళీ వైకాపా అధినేత జగన్ కి దగ్గరయ్యేందుకు మార్గాన్ని అందుకోబోతున్నాడా? అనే విషయాలపై కాలమే సమాధానం చెప్పాలి.

కొణతాల గతంలో తెదేపాలోకి వెళ్లేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు జరిపినా అందులోకి వెళ్ళలేక పోయాడు. లోపల ఏం జరిగిందో ఏమాగానీ, మొత్తానికి తెలుగుదేశంలో చేరేందుకు బాగా పావులు క‌దిపినా కానీ పనిజరక్కపోవడం శోచనీయం. అప్పట్లో క్లీన్ ఇమేజ్ ఉన్న కొణతాలను తెదేపాలోకి తీసుకొనేందుకు అధినేతతో సహా అందరూ ఓకే చేసినా స్థానికంగా నాయకుల నుండి వ్యతిరేకత రావడంతో లోకేష్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. కాగా ఇప్పుడు కాదు అసలు ఎప్పుడూ ఇక కొణతాల తెదేపాలోకి వెళ్ళే వాతావరణం కనపడటం లేదు. కాగా భాజపాలోకి వెళ్దామంటే ఆంద్రాలో భాజపాతో డైరెక్టు పాలటిక్స్ చేయలేమని భావిస్తున్నట్టుంది కొణతాల. ఇక కాంగ్రెస్ లోకి వెళ్లే సమస్యే లేదు. ఇక వైకాపాలోకి ఏమన్నా వెళ్లే బుద్ధి పుట్టినట్టుగానే ఉంది కొణతాలకు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రత్యేక హోదాపై ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఓ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టాడు కొణతాల. చూద్దాం ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement