పవన్ కళ్యాణ్ తన సొంత కథతో.... తీసిన సినిమాలు అతనికి పెద్దగా కలిసిరావనే చెప్పాలి. చాలా కాలం క్రితం తన సొంత కథ, డైరెక్షన్ లో తీసిన జానీ సినిమా పవన్ కి ఎటువంటి షాక్ ఇచ్చిందో అందరికి తెలుసు. ఇక అప్పటినుండి పవన్ డైరెక్షన్ వైపు గాని, సొంత కథల వైపు గాని వెళ్లకుండా వేరే వారి డైరెక్షన్స్ లో సినిమాలు చేస్తూ వుండిపోయాడు. మళ్ళీ చాన్నాళ్ళకి పవన్ కి డైరెక్షన్ మీద గాలి మళ్ళి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని చేసాడు. ఈ సినిమాకి ఆఫీసియల్ గా బాబీ డైరెక్టర్ అయితే అన్ఆఫీసియల్ గా పవన్ అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. ఇక అత్తారింటికి దారేది సినిమా హిట్ తో పవన్ మీద నమ్మకం తో ఈ సినిమాకి 80 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ సినిమా విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుని బయ్యర్స్ కి 30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
ఇక ఈ దెబ్బకు షాక్ తిన్న పవన్ వారిని గట్టెక్కించడానికి కాటమరాయుడు సినిమా మొదలెట్టాడు. ఇక ఈ సినిమా డాలి డైరెక్షన్ లో పవన్ - శృతి జంటగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా అనుకున్నప్పటి నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటూ ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఇక ఈ సినిమాని పవన్ ఎంత వీలయితే అంత తొందరగా పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడు. అందుకే విరామం లేకుండా షూటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ ఏర్పడలేదని అంటున్నారు.. క్రేజ్ లేని కారణంగానే బిజినెస్ కూడా సరిగా జరగడం లేదని.... డాలీ వంటి డైరెక్టర్ తో ఈ సినిమా చెయ్యడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని తాజా సమాచారం. అదే గనక త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తే పవన్ క్రేజ్ మరింత పెరిగేదని అంటున్నారు. సినిమా మొదలైనప్పటినుండి ఈ సినిమాపై నెగెటివ్ గా ప్రచారం జరగడం కూడా బిజినెస్ సరిగ్గా జరగక పోవడానికి కారణం గా చెబుతున్నారు.
కాటమరాయుడు కి సరిగ్గా బిజినెస్ జరిగి డబ్బులు రాకపోతే సర్దార్ బయ్యర్స్ కి పవన్ ఏ విధం గా సెటిల్ చేస్తాడో పాపం... అసలే డబ్బుల్లేవని సినిమాలు చేస్తున్నాని చెబుతున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా సమాధానమిస్తాడో చూద్దాం.