Advertisementt

రకుల్ కూడా రంగంలోకి దిగుతోంది..!

Fri 04th Nov 2016 08:05 PM
rakul preet singh,service,social service,rape victims,funds  రకుల్ కూడా రంగంలోకి దిగుతోంది..!
రకుల్ కూడా రంగంలోకి దిగుతోంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హీరోయిన్లు కూడా తగిన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు తగిన చేయూతను అందిస్తున్నారు. కాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ అత్యాచార బాధితులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తుంది. ఇప్పటికే హన్సిక అనాథ బాలలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటున్న విషయం తెలిసిందే. హన్సిక దాదాపు 34 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వారికి ఆశ్రమాన్ని కల్పించే పనిలో ఉంది. ఇక త్రిష అయితే శునకాలను రక్షించేందుకు కంకణం కట్టుకుంది. నటి సమంత స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇక మరోపక్క నమిత సొంత ఖర్చులతో మహిళలకు మరుగుదొడ్లు కట్టిస్తుంది. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఏదైనా సామాజిక సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో అత్యాచార బాధితులను ఆదుకొనేందుకు సిద్ధ పడింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాగా ఈ నవంబర్ 20వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ వ్యాయామ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి రకుల్‌ప్రీత్‌ సింగ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఇక్కడే రకుల్ ప్రీత్ సింగ్ ప్రవేశపెట్టనున్న సేవాకార్యక్రమానికి సంబంధించిన నిధిని ఏర్పాటు చేసి ఆ రూపంలో ధనాన్ని పోగుచేసుకొని వారికి తగిన విధంగా సాయం అందించేందుకు సంసిద్ధం అవుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ