సుమారు రూ.2 వేల కోట్లతో ఐనవోలులో అమరావతి కేంద్రంగా విట్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఈ విట్ సంస్థకు రాష్ట్రప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించగా, వంద ఎకరాల్లో వర్శిటీ భవనాలను నిర్మించనుంది. ఐనవోలులోని విట్ యూనివర్శిటీ శంకుస్థాపన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రైవేటు రంగానికి సంబంధించి తొలిసారిగా విట్ యూనివర్శిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నాడు. వెల్లూరు ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి గొప్ప చరిత్ర ఉందని, కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందని బాబు వివరించాడు. కాగా రాబోవు కాలంలో విద్యార్ధులంతా ప్రపంచస్థాయిలో పోటీపడేంత పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగు పరచుకొనేందుకు ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వెల్లడించాడు. కాగా దేశంలోనే అన్నింటికంటే అమరావతి విట్ ముందుండాలని ఆయన ఆకాంక్షించాడు. అయితే ఇదే సభకు వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...అతి తక్కువ కాలంలో ఉత్తమ సచివాలయాన్ని నిర్మించిన ఘనత సీయం చంద్రబాబుకు దక్కుతుందని తెలిపాడు. ఇదే సందర్బంగా వెంకయ్య నాయుడు, చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని వెంకయ్య తెలిపాడు. మొత్తానికి శంకుస్థాపనలకే బాబును, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇంతలా పొగిడేస్తున్నాడు.