ఆరెంజ్ చిత్రంలో రామ్ చరణ్ లవర్ బాయ్ గా కనిపించి పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఆ సినిమా చరణ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా దెబ్బకు రామ్ చరణ్ ఇక లవర్ బాయ్ గెటప్స్ కి దూరంగా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న ధ్రువ చిత్రం కంప్లీట్ కాగానే చరణ్.. సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ చితంలో చరణ్ లవర్ బాయ్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. త్వరలోనే ముహూర్తం జరుపుకోనున్న ఈ చిత్రం తొంబైల్లోని పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుందని సమాచారం.
ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా ఒక హీరోయిన్ ని సెట్ చేశారని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు..... ఆమె మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో సుప్రీమ్ చిత్రంలో నటించిన రాశి ఖన్నా. ఈమెను ఈ చిత్రంలో చరణ్ కి జోడిగా ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాశిఖన్నాని ఈ చిత్రం కోసం ఆడిషన్ కూడా చేశారని చెబుతున్నారు. ఇక ఆల్మోస్ట్ రాశి ఖన్నా చరణ్ కి జోడిగా కన్ఫర్మ్ అయ్యిపోయిందని అంటున్నారు. ఇక ఇదే గనక నిజమైతే రాశిఖన్నాకి అదృష్టం పట్టుకున్నట్లే. ఇప్పటివరకు స్టార్ హీరోలతో చెయ్యని రాశిఖన్నా ఇప్పుడు చరణ్ తో చెయ్యడం అంటే ఇంక టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయినట్లే. అయితే ఇప్పుడిప్పుడే సోలో హీరోయిన్ అవకాశాలు పొందుతున్న రాశి కి ఈ మూవీ లో వచ్చిన ఛాన్స్ మెయిన్ హీరోయిన్ గానా, లేక మళ్ళీ వేరే హీరోయిన్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంటుందా అనేది తెలియాల్సి వుంది.
ఏది ఏమైనా కూడా చరణ్ తో కలిసి నటించే అవకాశం రావడం మాత్రం రాశికి మామూలు విషయం కాదు. ఇక చరణ్ పక్కన రాశి నటిస్తే..మిగతా స్టార్ హీరోలందరూ రాశి తో ఓ రౌండ్ వేసుకోవడం ఖాయం. సో.. ఈ ఛాన్స్ తో రాశిఖన్నా..టాలీవుడ్ టాప్ సింహాసనం కోసం కచ్చిఫ్ వేసుకున్నట్లే.