పవన్, చిరు కలిసి కనిపించడం లేదని మెగా ఫాన్స్ దగ్గర నుండి సామాన్య ప్రేక్షకుడు వరకు తెగ చర్చించేసుకుంటున్నారు. వీరి మధ్యన ఏదో..... జరిగిందని అందుకే అన్నదమ్ములు విడిపోయారని తెగ వార్తలు హల్ చల్ చేశాయి. అసలు పాలిటిక్స్ లోకి చిరు రావడం... పవన్ కొన్నాళ్ళు అన్నని సపోర్ట్ చెయ్యడం ఆనతి కాలంలోనే చిరు కాంగ్రెస్ లోకి వెళ్లడంతో అన్నదమ్ములకు గొడవలు స్టార్ట్ అయ్యాయని అందరూ తెగ చెప్పుకున్నారు. అయినా పవన్ తో పెద్దగా సంబంధాలు లేనట్లు మెగా ఫ్యామిలీ ప్రవర్తించడం, పవన్ కూడా మెగా ఫ్యామిలీతో అంటీముట్టనట్లు ఉండడం అనే విషయాలు సామాన్య మానవుడిని కూడా ఆలోచింపజేసాయి. ఇక మెగా ఫ్యామిలీ పార్టీలకి, ఫంక్షన్స్ కి పవన్ రాకపోవడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
అయితే మా మధ్యన ఏం లేదంటూ అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు చెబుతూ ఉండేవారు. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ కి చిరంజీవి వెళ్లి యూనిట్ తో కలిసి కాసేపు స్పెండ్ చేసి..టీం కి విశేష్ చెప్పిన టైం లో కూడా వారు..మా మధ్య ఎటువంటి గొడవలు లేవని, మేమంతా కలిసే ఉన్నామని చెప్పారు. ఇక రామ్ చరణ్ అయితే మా బాబాయ్ కి, మాకు ఏం గొడవలు లేవని చాలాసార్లు మీడియాకి వివరణ కూడా ఇచ్చాడు. అసలు ఇవన్నీ వదిలేస్తే మొన్న దీపావళికి కూడా మెగా ఫ్యామిలీ ఫొటోలో పవన్ కనబడలేదంటే చూడండి వీరి గొడవలు ఎంతగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక్క సంఘటన చాలు. ఇక ఆ ఫోటో లో పవన్ లేకపోవడం కూడా టాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.
అవన్నీ అలా ఉండగా ఇప్పుడు పవన్, చిరు ఇద్దరూ ఒకే చోట కలిసి ఒక గంట సేపు మాట్లాడుకున్నారనే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. వీరిద్దరూ పవన్ తాజాగా చేస్తున్న కాటమరాయుడు షూటింగ్ స్పాట్ లో కలిశారట. కాటమరాయుడు షూటింగ్ దగ్గరకి చిరు వెళ్ళాడట. అయితే ఏదో పవన్ ని చూడడానికో లేక తమ్ముడితో మాట్లాడడానికో కాదులెండి చిరు అక్కడికి వెళ్ళింది. చిరు తన 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 చిత్రం షూటింగ్ లో భాగంగా కాటమరాయుడు సెట్స్ కి వెళ్ళాడట. ఖైదీ సినిమాలో కొన్ని సీన్స్ ని కాటమరాయుడు సెట్స్ లో చిత్రీకరణ జరపడానికి చిరు అక్కడికి వెళ్ళాడట. అయితే అలా వెళ్లిన చిరు తన తమ్ముడితో ఒక గంటసేపు ముచ్చడించాడని చెబుతున్నారు.
కేవలం తన సినిమా షూటింగ్ కోసమే తమ్ముడి సినిమా సెట్స్ కి వెళ్ళాడు గాని.... పని కట్టుకుని తమ్ముణ్ణి పలకరించడానికైతే వెళ్ళలేదు చిరు.