Advertisementt

పవన్ పై భాజపా అటాక్ మొదలైంది..!

Thu 03rd Nov 2016 03:46 PM
pawan kalyan,bjp,siddharthnath singh,bjp ap leader,bjp attack on pawan  పవన్ పై భాజపా అటాక్ మొదలైంది..!
పవన్ పై భాజపా అటాక్ మొదలైంది..!
Advertisement
Ads by CJ

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై భాజపా చాలా తెలివిగా ఎదురుదాడి మొదలెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదాకోసం పోరాటంలో భాగంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ పై ముందుగానే ఎదురుదాడి దిగేందుకు ప్రయత్నిస్తుంది భాజపా. పవన్ కళ్యాణ్ పోరాటం ప్రత్యేకహోదాపైనే ఉంటుందని గ్రహించిన భాజపా అందుకు తగిన విధంగా ఏపీలో ఎత్తుకు పైఎత్తులు వేసే దిశగా అడుగులు వేస్తుందనే చెప్పాలి. దీంతో పవన్ జనసేనకు, భాజపాకు మధ్య ఎడం పెరుగుతుందనే చెప్పాలి. రాబోవు ఎన్నికల్లో జనసేన భాజపాతో కలిసే అవకాశాలు లేవనే విషయం ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. అసలు కాకినాడ సభలో పవన్ భాజపాపై విరుచుకుపడిన తర్వాత సీన్ మారిపోయింది. ఇరు పార్టీల మధ్య అటాక్ మొదలైంది. ప్రస్తుతం ఏకంగా ఇక పవన్ నే టార్గెట్ చేయడానికి భాజపా నడుం బిగించింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ భాజపా ఇంచార్జ్ సిద్దార్థ్ నాధ్ సింగ్ పవన్ పై సంచలనం రేపేలా వ్యాఖ్యలు చేశాడు.

కాగా పోయిన దఫా జరిగిన సాధారణ ఎన్నికల్లో నరేద్రమోడీ, చంద్రబాబుల పక్కనే కూర్చొని  పవన్ ఎన్డీయేకి మద్దతు పలికి ఆ దిశగా ప్రచారంలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.  కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే గతంలో వలె పవన్, ఎన్డీయేతో కలిసి ఎన్నికలకి వెళ్లే పరిస్థితి కనపడటం లేదు. కాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భాజపా ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. జనసేన మద్దత్తు కోసం తాము ఎప్పుడూ ప్రాకులాడలేదని, పవన్ కల్యాణే తమకు మద్దత్తు ఇచ్చాడన్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని సిద్దార్థ్ నాథ్ సింగ్ అన్నారు. చూడబోతే భాజపా ఇక పవన్ ను లక్ష్యంగా చేసుకొని ప్రతిదాడికి దిగనుందన్నది స్పష్టమౌతున్న అంశం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ