Advertisementt

శృతిహాసన్ స్పందనే తేడాగా వుంది..!

Thu 03rd Nov 2016 01:50 PM
shruti haasan,gauthami,kamal haasan,living together breakup  శృతిహాసన్ స్పందనే తేడాగా వుంది..!
శృతిహాసన్ స్పందనే తేడాగా వుంది..!
Advertisement
Ads by CJ

ప్రముఖ నటుడు క‌మ‌ల్ హాస‌న్, గౌత‌మిలు విడిపోయిన విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కాగా గౌతమి, కమల్ హాసన్ నుండి విడిపోవడం వెనుక ఉండలేక పోవడం అన్నది ప్రధానాంశంగా తెలుస్తుంది. ఊహించని ఈ పరిణామానికి ఎవరు కారణం అన్న విషయాన్ని గురించి ప్రస్తావిస్తే.. శృతిహాసన్ అన్న విషయం టక్కున మదిలో మెదిలే సమాధానం. ఆ విధంగా గౌతమిపై అభిమానులందరికీ సానుభూతి పెరిగిపోతుంది. కమల్, గౌతమి ఇద్దరూ విడిపోవడానికి కారణం శృతిహాసనేనంటూ సినీ వర్గాల్లో చర్చరేగుతుంది. ఈ విషయంపై క‌మ‌ల్ హాస‌న్ కూడా ఎటువంటి స్పందనా తెలపకపోవడం విశేషం.  అయితే ఈ విషయంపై కమల్ మాట్లాడుతూ... గౌత‌మి త‌న నిర్ణ‌యం తాను తీసుకొంది, అందులో ఏముంది ఇక చెప్పడానికి అంటూ తన సన్నిహిత మీడియా ప్రతినిధుల వద్ద వెల్లడించినట్లుగా తెలుస్తుంది. కాగా వీరిద్దరూ విడిపోవడానికి కారణంగా చెప్పుకుంటున్న శృతిహాసన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ఎవరి వ్య‌క్తిగ‌త జీవితం వారిది. అటువంటి విష‌యాల్లో నేను జోక్యం చేసుకోను. వారు తీసుకున్న నిర్ణ‌యంపై నేను కామెంట్స్ చేయడం పద్ధతిగా ఉండదు.  నా త‌ల్లిదండ్రులు, నా సోద‌రి అంటే నాకు గౌర‌వం, ప్రేమ‌. వాళ్ల విషయాలు త‌ప్ప మ‌రొకరి విష‌యం గురించి నాకు అన‌వ‌స‌రం... అంటూ వెల్లడించింది శృతిహాసన్.

అయిత శృతిహాసన్ ఈ సమయంలో ఈ విధంగా స్పందించడంపై పెద్ద దుమారం రేగుతుంది. గౌత‌మి ప‌రాయి వ్య‌క్తి అన్న‌ట్టుగా, ఆమెతో తనకు, త‌న‌ కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టుగా శృతిహాసన్ చేతులు దులుపేసుకోవడం జరిగింది. అయితే త‌న తండ్రితో 13 ఏళ్లు స‌హ‌జీవ‌నం చేసిన గౌత‌మి ప‌రాయి వ్య‌క్తి ఎలా అవుతుందని మాత్రం తెలియకపోవడం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. కానీ కమల్ హాసన్ వలెనే కూతురు శృతిహాసన్ కూడా చాలా విషయాల్లో ముక్కు సూటిగా వ్యవహరిస్తుంది కానీ ఈ విషయంలో మాత్రం కాస్త ఆచితూచి స్పందిస్తున్నట్లుగా కనిపిస్తున్నా...అసలు తేడా అంత శృతి వల్లే వచ్చిందనేది ఆమె మాటలను బట్టి తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ