గౌతమీ నిన్న అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. కమల్ నుండి తాను శాశ్వతం గా విడిపోతున్నట్లు ప్రకటించింది. నిన్న ఇదే విషయంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. గౌతమీ ఎందుకు కమల్ హాసన్ నుండి విడిపోయింది అని. కారణం చెప్పలేదు గాని కమల్ తో తన సహజీవనానికి బ్రేకులు పడ్డాయని మాత్రం చెప్పింది. అయితే ఆ కారణం ఏమిటని మీడియా ఏవేవో కథలు ప్రచారం చేసింది. కేవలం కమల్ పెద్ద కూతురు శృతి హాసన్ తో గౌతమికి విభేదాలు రావడం వల్లే గౌతమీ, కమల్ నుండి విడిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి గొడవలో కమల్.. శృతి ని సపోర్ట్ చెయ్యడం గౌతమిని బాధించిందని... అందుకే గత రెండు నెలలుగా గౌతమి, కమల్ కి దూరంగా సొంత కూతురి దగ్గర ఉంటుందని... ఇక ఎట్టకేలకు కమల్ తో బంధానికి తెరదించిందని... ఏవేవో కథలు మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఇంత జరిగినా కమల్ ఎక్కడ తన స్పందనని తెలియజేయలేదు.
అయితే తాజాగా ఇప్పుడు కమల్ ఈ వార్తలపై స్పందించాడు. గౌతమికి తనతో కలిసి ఉండడం ఇష్టం లేదు గనకే విడిపోయింది. తనకి ఎలా నచ్చితే అలా ఉండే హక్కు గౌతమికి వుంది. తనతో విడిపోయి ఆమె ఆనందంగా ఉండగలను అనుకుంటే అలాగే ఉండనివ్వండి. తన సంతోషమే నాకు కావాలి. గౌతమి తీసుకున్న నిర్ణయం తనకి నచ్చి తీసుకుందని అన్నారు. ఇక గౌతమీ తన కూతురు సుబ్బలక్ష్మి ఇద్దరూ సంతోషంగా వుండాలని ఆకాంక్షించారు. గౌతమికి ఎల్లప్పుడూ మంచే జరగాలని కమల్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇక తనకి శృతి హాసన్, అక్షర హాసన్, సుబ్బలక్ష్మి వంటి ముగ్గురు కూతుర్లు ఉండడం తన అదృష్టమని అన్నారు. ఇక వీరికి తండ్రిని కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
అంతేగాని గౌతమి తనతో విడిపోవడానికి అసలు కారణం మాత్రం కమల్ కూడా బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డాడు.