Advertisementt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మరో షాక్!

Wed 02nd Nov 2016 08:01 PM
ntr,young tiger,janatha garage,surendar reddy,trivikram,kumara swamy  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మరో షాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మరో షాక్!
Advertisement
Ads by CJ

సురేంద్ర రెడ్డి, ఎన్టీఆర్ ని డైరెక్ట్ చెయ్యనని చెప్పాడట. ఇది నిజమో కాదో తెలియదు కానీ... ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యాక ఏ దర్శకుడుతో పని చేస్తాడో అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. ఒకసారి పూరితో చేస్తున్నాడని అంటారు... మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అంటారు. కానీ ఇంత వరకు ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ ని మాత్రం సెట్ చెయ్యలేకపోయాడు. అయితే ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్స్ గా పేరు పొందిన వి వి వినాయక్, సురేంద్ర రెడ్డి వైపు చూస్తున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. 

ఎన్టీఆర్ మాత్రం సురేంద్రరెడ్డి పై నమ్మకం పెట్టుకుని ఆయన్ని తన నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చెయ్యమని అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అయితే సురేంద్రరెడ్డి.. ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి సుముఖంగా లేడని చెబుతున్నారు. ఎందుకంటే సురేందర్ రెడ్డి కి ఒక భారీ ఆఫర్ తగలడం వల్ల ఎన్టీఆర్ ని పక్కన బెట్టాడని అంటున్నారు. ఆ ఆఫర్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నుండి వచ్చిందనీ....  సురేందర్ రెడ్డిని కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ రెండో సినిమాని డైరెక్ట్ చెయ్యమని అడిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా గనక డైరెక్ట్ చెయ్యడానికి సురేందర్ ఒప్పుకుంటే భారీ మొత్తం లో ముట్టచెప్పడానికి వారు రెడీ అయ్యారని చెబుతున్నారు . ఈ భారీ ఆఫర్ తగలడం వల్లే సురేందర్ రెడ్డి.. ఎన్టీఆర్ ని తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. 

మరి ఎన్టీఆర్ ని టాప్ డైరెక్టర్స్ ఇలా రిజెక్ట్ చెయ్యడమేమిటో గాని పాపం ఎన్టీఆర్ మాత్రం డీలా పడినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రం ఎన్టీఆర్ ని తిరస్కరించగా... ఇప్పుడు సురేంద్ర రెడ్డి కూడా తిరస్కరించాడు. మరి ఎన్టీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ