గద్వాల్ రాణిగా పేరొందిన కాంగ్రెస్ సీనియర్ నేత డికె అరుణ పార్టీ మారతున్నారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అతి త్వరలోనే డికె అరుణ పార్టీ మారనున్నారన్న విషయం బాగా ఊపందుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి డికె అరుణ తెరాస ప్రభుత్వాన్ని, కెసిఆర్ అమలు జరిపే విధానాల్ని ఎండగడుతూ నిరంతరం హాట్ హాట్ గా ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా డికె అరుణపై ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుండి డికె అరుణ బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా డికె అరుణ త్వరలోనే తెరాసలో చేరిపోనున్నారని కూడా దుమ్మురేపే ప్రచారం సాగుతుంది.
కాగా ఈ ప్రచారం ఇంతకముందే పెద్ద ఎత్తున సాగినా అప్పట్లో డికె అరుణ అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని తీవ్రంగా ఖండించింది. కానీ తాజాగా తెరాస ఎంపి కవిత, డికె అరుణపై చేసిన కామెంట్ రాజకీయ దుమారానికి దారితీస్తుంది. డికె అరుణ త్వరలోనే పార్టీ మారనుందని, ఆమె పార్టీ మారడంపై ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ వెల్లడించడంతో రాజకీయం వేడెక్కుతుంది. కాగా ఈ మధ్యనే గద్వాల్ ప్రత్యేక జిల్లాపై డికె అరుణ పోరాటం చేయడం, అందుకోసం అలకలు, పెద్ద ఎత్తున విరుచుకుపడడాలు వంటివి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డికె అరుణ పదవికి రాజీనామా చేయడం వంటివి కూడా జరిగినవి. తర్వాత కెసిఆర్, గద్వాల్‌ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో డికె అరుణ ప్రస్తుతం తన రాజకీయ డిఫెన్స్ లో పడినట్లుగా తెలుస్తుంది. తాజాగా కవిత మాటలతో డికె అరుణకు ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తుంది.