Advertisementt

ఈ సినిమా ఇంకో వారం ఆడితే బావుండు..!

Wed 02nd Nov 2016 07:21 PM
ae dil hai mushkil,ranbir kapoor,aishwarya rai,ae dil hai mushkil collections  ఈ సినిమా ఇంకో వారం ఆడితే బావుండు..!
ఈ సినిమా ఇంకో వారం ఆడితే బావుండు..!
Advertisement
Ads by CJ

గత మూడేళ్లుగా తాను నటించిన నాలుగు చిత్రాలు బాగా ఆడలేదు. దీంతో రణబీర్‌కపూర్‌ చిక్కుల్లో పడ్డాడు. ఆయనకు ఇప్పుడు అర్జంట్‌గా ఓ హిట్‌ కావాలి. కాగా ఆయన హీరోగా నటించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంపై ఆయనతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటించిన ఐశ్వర్యారాయ్‌ తన 42ఏళ్ల వయసులో కూడా తన కంటే చిన్నవాడైన రణబీర్‌కపూర్‌తో లిప్‌లాక్‌లు చేసి, ఇంకా సినిమా నిండా హాట్‌హాట్‌ అందాలతో కనువిందు చేయడం చర్చనీయాంశం అయింది. దీంతో ఈ చిత్రంపై శృంగార ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క ఈ చిత్రానికి కరణ్‌జోహార్‌ దర్శకుడు కావడంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగురోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఇండియాలో కంటే ఓవర్‌సీస్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదంతా కరణ్‌జోహార్‌కు ఓవర్‌సీస్‌లో ఉన్న క్రేజ్‌ పుణ్యం. ఇక వరుసగా సెలవులు రావడం ఈ చిత్రానికి మరింత ప్లస్‌ అయింది. ఇదే ఊపులో మరో వారం రోజులు కనుక ఈ చిత్రం థియేటర్లలో నిలబడితే రణభీర్‌కపూర్‌కు ఉన్న ఒకే ఒక్క హిట్‌ కోరిక కూడా నెరవేరుతుందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. మరి ఒకే ఒక్కవారం రణబీర్‌ భవిష్యత్తును తేల్చనుందని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ