Advertisementt

నాగ్ జస్ట్ గెస్ట్...అంతే..!

Wed 02nd Nov 2016 05:25 PM
nagarjuna,rajugari gadhi 2,nag guest role,pvp banner,pvp,ohmkar  నాగ్ జస్ట్ గెస్ట్...అంతే..!
నాగ్ జస్ట్ గెస్ట్...అంతే..!
Advertisement
Ads by CJ

నాగార్జున ఓంకార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తాడని మీడియాలో ఒకటే న్యూస్. ప్రస్తుతం నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కంప్లీట్ కాగానే నాగార్జున ఓంకార్ డైరెక్షన్ లో చేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా 'రాజుగారిగది 2' గా ఉంటుందని.... ఈ చిత్రం పివిపి బ్యానర్ లో తెరకెక్కుతోందని  చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బయటికి వచ్చింది.  పివిపి కోసమే నాగార్జున ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే 'ఊపిరి' వంటి హిట్ ఇచ్చిన పివిపి బ్యానర్ కోసం నాగార్జున ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. 

ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన 'రాజుగారిగది' సినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ లీడ్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పుడు వచ్చే పార్ట్ 2 లో కూడా ఓంకార్ తమ్ముడు అశ్విన్ లీడ్ రోల్ లో కనిపించనున్నాడని... ఇంకా ఈ సినిమాలో నాగసౌర్య, రాజ్ తరుణ్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఇక నాగ్ కేవలం గెస్ట్ పాత్రకే పరిమితమని ప్రచారం మొదలైంది. వరుస ప్లాప్ లతో అసలు సినిమాలు తీయడం మానేయాలని భావించిన పివిపి బ్యానర్ కి ఊపిరి తో పెద్ద సక్సెస్ ఇచ్చిన నాగ్ సెంటిమెంట్ కలిసొస్తుందని భావించి పివిపి..నాగ్ ని అడగడం, క్యారెక్టర్ కూడా నచ్చడంతో నాగ్ గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగిపోయాయని ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ