Advertisementt

ఈ బాబు.. కొడుకు కోసం కోటి తిప్పలు!

Wed 02nd Nov 2016 01:41 PM
bellamkonda suresh,gautham menen,bellamkonda sai srinivas,boyapati sreenu  ఈ బాబు.. కొడుకు కోసం కోటి తిప్పలు!
ఈ బాబు.. కొడుకు కోసం కోటి తిప్పలు!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎలాగైనా హీరో చెయ్యాలని కంకణం కట్టుకుని మొదటి సినిమానే భారీ లెవల్లో నిర్మించాడు. ఇక బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్ కోసం మొదటి సినిమాకే సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ తో జోడి కట్టించాడు. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ తో డైరెక్ట్ చేయించాడు బెల్లంకొండ. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తో నిలబడింది. ఇక రెండో సినిమాని భారీ లెవల్లో తెరకెక్కించాడు. ఈ సినిమాకి రీమేక్ సినిమాలకు పేరొందిన భీమినేని దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో సోనారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే మూడవ సినిమాతోనైనా తన కొడుక్కి హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యం తో మాస్ డైరెక్టర్ బోయపాటిని లైన్ లో కి తెచ్చాడు. కానీ బోయపాటికి బెల్లంకొండ ఆఫర్ అయితే నచ్చింది కానీ ఆయన కొడుకు శ్రీనివాస్ సరిగా నచ్చలేదేమో ఈ సినిమా చెయ్యడానికి  పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ మొదలైంది. 

అందుకే బెల్లంకొండ మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడని అంటున్నారు. ఈ విషయాన్ని బెల్లంకొండ స్వయంగా ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ గౌతమ్  మీనన్ కి, బెల్లంకొండకి పాత పరిచయాల కారణంగా గౌతమ్ మీనన్ ని తన కొడుకుతో ఒక సినిమా చెయ్యమని కోరాడట. ఇక దీనికి గౌతమ్ కూడా ఒప్పుకున్నాడట. అయితే ఈ విషయాలన్ని బెల్లంకొండ సాహసం శ్వాసగా సాగిపో  సినిమా ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్టన్ లో తెరకెక్కింది. ఈ చిత్రం నవంబర్ 11 న విడుదలకి సిద్ధమైంది. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ బెల్లంకొండ శ్రీనివాస్ ని డైరెక్ట్ చేస్తాడన్న మాట. ఇక ఈ ప్రాజెక్ట్ ని బెల్లంకొండ సురేష్ ఏ లెవెల్లో తెరకెక్కిస్తాడో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ